Maruti Alto 800 7 Seater: Maruti Suzuki కంపెనీకి దశాబ్దాలుగా వినియోగదారుల నుంచి ఎంతో ఆదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి కారు విడుదల అవుతుందంటే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అన్ని వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉండే కార్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా కొన్ని ఏళ్ల కిందట సామాన్యులు సైతం కారు పొందాలని ఉద్దేశంతో తక్కువ ధరలో ఆల్టో 800 కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఈ కారు ను ఎంతోమంది కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఇది 7 సీటర్ గా అవతరించింది. త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
మారుతి ఆల్టో 800 2026 సెవెన్ సీటర్ కారు ఉమ్మడి ఫ్యామిలీకి అనుగుణంగా ఉండేలా తీర్చిదిద్దారు. శక్తివంతమైన ఇంధన సామర్థ్యం కలిగిన ఇందులో త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు ఇది 47 టు 48 పీహెచ్ పవర్ ను అందిస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఆప్షన్ తో ఇది పనిచేస్తుంది. ఈ ఇంజన్ తేలికైన నిర్మాణం తో పాటు ఇంధన ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో నగరాలతో పాటు దూర ప్రయాణాలు చేసే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
ఇందులో ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే 7 సీటు లేఔట్ తో పాటు విశాలమైన క్యాబిన్ ను అందించారు. అలాగే ఏఐ ఆధారిత డ్రైవింగ్ అలర్ట్, బేసిక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, స్మార్ట్ రిమైండర్ వంటివి అమర్చారు. ఇవి మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఎక్స్టీరియర్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా అమర్చారు. గతంలో వచ్చిన కార్లతో పోలిస్తే ఈ కొత్త కారులో ఫ్రెంట్ గ్రిల్, కాంపాక్ట్ ఫుట్ ప్రింట్ ఉన్నప్పటికీ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఫ్యామిలీ సభ్యులు అంతా ఒకేసారి ప్రయాణం చేసేందుకు అనుగుణంగా దీనిని అమర్చారు. ఈ కొత్త కారులో సేఫ్టీకి తగిన ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ఎయిర్ బ్యాగ్స్ తో పాటు EBD తో కూడిన ABS, రియర్ పార్కింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఆత్మవిశ్వాసం తో పాటు రోజువారి డ్రైవింగ్ చేసే వారికి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. తక్కువ ధరలో కారు కొనాలని అనుకునేవారు.. సెవెన్ సీటర్ కారు కోసం చూసేవారు ఈ మోడల్ మంచి ఎంపిక అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.