https://oktelugu.com/

ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని తీసుకుంటున్నారా.. ప్రమాదమేనంటున్న వైద్యులు?

మనలో చాలామంది ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తీసుకుంటున్నారు. అయితే ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చల్లటి పదార్థాలను ప్లాస్టిక్ ప్లేట్లలో తీసుకోవచ్చు కానీ వేడి పదార్థాలను మాత్రం ప్లాస్టిక్ ప్లేట్లలో తీసుకోకూడదు. సాధారణంగా ప్లాస్టిక్ ను తయారు చేయడం కోసం బిఎస్‌ ఫినాల్‌ను వినియోగించడం జరుగుతుంది. పాలికార్బోనేట్‌ లేదా రీసైకిల్‌ కోడ్‌7 పేరుతో పిలవబడే ఇది ప్లాస్టిక్ లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 8, 2021 / 08:02 PM IST
    Follow us on

    మనలో చాలామంది ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తీసుకుంటున్నారు. అయితే ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చల్లటి పదార్థాలను ప్లాస్టిక్ ప్లేట్లలో తీసుకోవచ్చు కానీ వేడి పదార్థాలను మాత్రం ప్లాస్టిక్ ప్లేట్లలో తీసుకోకూడదు. సాధారణంగా ప్లాస్టిక్ ను తయారు చేయడం కోసం బిఎస్‌ ఫినాల్‌ను వినియోగించడం జరుగుతుంది.

    పాలికార్బోనేట్‌ లేదా రీసైకిల్‌ కోడ్‌7 పేరుతో పిలవబడే ఇది ప్లాస్టిక్ లో కలిసే అవకాశం అయితే ఉంటుంది. బిఎస్‌ ఫినాల్‌ విషపూరితం కావడంతో పాటు దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఇతర సమస్యలు వస్తాయి. బీపీఏ అనేది ఈస్ట్రోజన్ ఇతర హార్మోన్లను అసమతుల్యత చేసే కెమికల్ కావడం గమనార్హం. బీపీఏ వల్ల మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు అలెర్జీలు, క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

    ఎవరైతే ప్లాస్టిక్ పాత్రలలో ఎక్కువగా ఆహారం తీసుకుంటారో వాళ్లకు ఇమ్యూనిటీ పవర్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ ప్లేట్లలో తినకుండా ఉంటేనే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మైక్రో వేవ్ లో ఆహారంను వేడి చేసే సమయంలో ప్లాస్టిక్ పాత్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా సిరామిక్ లేదా గాజు పాత్రలను వినియోగించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    దేశంలో రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండగా ప్లాస్టిక్ వస్తువులను నిరోధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కోరుతుండటం గమనార్హం. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి వందల సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉంటే మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.