https://oktelugu.com/

కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు.. ఆ స్కీమ్ లో చేరిన వాళ్లకు శుభవార్త?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. సాధారణంగా ఇప్పటివరకు ఒక వ్యక్తికి ఒక పీపీఎఫ్ ఖాతా మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలను కలిగి ఉంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కు సంబంధించిన బెనిఫిట్స్ ను పొందలేరు. ఒకటి కంటే ఎక్కువగా ఉండే పీపీఎఫ్ ఖాతాలను ఇర్రెగ్యులర్ గా పరిగణిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 8, 2021 8:09 pm
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. సాధారణంగా ఇప్పటివరకు ఒక వ్యక్తికి ఒక పీపీఎఫ్ ఖాతా మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలను కలిగి ఉంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కు సంబంధించిన బెనిఫిట్స్ ను పొందలేరు. ఒకటి కంటే ఎక్కువగా ఉండే పీపీఎఫ్ ఖాతాలను ఇర్రెగ్యులర్ గా పరిగణిస్తారు.

    కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొనిరాగా ఈ నిబంధనల వల్ల ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు ఉన్నవాళ్లు ఆ ఖాతాలను విలీనం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌లలో ఒకటి కంటే ఎక్కువగా ఓపెన్ చేసిన పీపీఎఫ్ ఖాతాలను విలీనం చేసుకునే అవకాశం ఉంటుంది. రెండు వేర్వేరు ఆపరేటింగ్ ఏజెన్సీలలో పీపీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నప్పుడు అకౌంట్ల విలీనానికి సంబంధించి రిక్వెస్ట్ పెట్టుకోవాలి.

    ఒకే ఆపరేటింగ్ ఏజెన్సీలో ఒకటి కంటే ఎక్కువగా పీపీఎఫ్ ఖాతాలను కలిగి ఉంటే మాత్రం సులభంగానే ట్రాన్స్‌ఫర్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీపీఎఫ్ ఖాతాపై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోందని తెలుస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా పీపీఎఫ్ ఖాతాను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు డిపాజిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు లోన్ కూడా పొందే అవకాశం ఉంటుంది.