Keerthi Suresh: నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కీర్తి సురేశ్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది ఈ భామ. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ” మహానటి ” సినిమాతో కీర్తి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాలో కీర్తి నటనతో కట్టిపడేసిందనే చెప్పాలి. అప్పటి నుంచి ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఇంకోవైపు తనకంటూ ప్రత్యేకత ఉన్న ఏ క్యారెక్టర్ కి అయినా సై అంటోంది. తెలుగు, తమిళ, మళయాళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి. గత యేడాది కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ చిత్రాలు ఓటీటీలో విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ ఏడాది రంగ్ దే తో ప్రేక్షకులను పలకరించగా… త్వరలోనే గుడ్ లక్ సఖి చిత్రంతో రానుంది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఈ ఇంటరెస్టింగ్ ప్రాజెక్టు కి ఒకే చెప్పినట్టు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
మెగా ఫ్యామిలిలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసిలో నటించిన కీర్తి… భోళా శంకర్ లో చిరుకి చెల్లెలిగా చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ – బోయపాటి కాంబోలో చేయబోతున్న సినిమాలో కీర్తి సురేష్ ఓకే అయినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 1 చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల కానుండగా… వెంటనే పార్ట్ 2ను మొదలు పెట్టకుండా బోయపాటి మూవీ లైన్ లో పెట్టనున్నాడంట అల్లు అర్జున్.
సరైనోడుతో బన్నీకి సూపర్ హిట్ అందించిన బోయపాటి మరోసారి కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్దం అవుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబోతున్నారంట. అలానే వచ్చే రెండు మూడు నెలల్లోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తుంది. దీంతో అఫీషియల్ ప్రకటన ఎప్పుడా అని కీర్తి అభిమానులు ఎదురుచూస్తున్నారు.