https://oktelugu.com/

Best Foods To Be Strong: బక్కగా ఉన్నారా.. బలంగా మారాలంటే తినాల్సిన ఆహార పదార్థాలివే?

Best Foods To Be Strong: మనలో చాలామంది బక్కగా ఉండటం వల్ల ఆత్మనూన్యతా భావానికి లోనవుతూ ఉంటారు. ఎంత ఆహారం తిన్నా లావు కావడం లేదని చాలామంది చెబుతూ ఉంటారు. జన్యుపరమైన సమస్యలు, థైరాయిడ్, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు బరువు పెరగకుండా ఉండటానికి కారణమవుతాయనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా సులువుగా బరువు పెరగడం సాధ్యమవుతుంది. నువ్వులు, అవిసె గింజలు, సోయా ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 26, 2022 / 10:09 AM IST
    Follow us on

    Best Foods To Be Strong: మనలో చాలామంది బక్కగా ఉండటం వల్ల ఆత్మనూన్యతా భావానికి లోనవుతూ ఉంటారు. ఎంత ఆహారం తిన్నా లావు కావడం లేదని చాలామంది చెబుతూ ఉంటారు. జన్యుపరమైన సమస్యలు, థైరాయిడ్, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు బరువు పెరగకుండా ఉండటానికి కారణమవుతాయనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా సులువుగా బరువు పెరగడం సాధ్యమవుతుంది.

    నువ్వులు, అవిసె గింజలు, సోయా ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మీగడతో ఉన్న పెరుగు, వెన్నతో ఉన్న పాలు, తాజా పండ్లు, రెండు లీటర్ల నీళ్లు తాగడం ద్వారా కూడా బలంగా మారవచ్చు. బాదం, వేరుశెనగ గింజలు, పిస్తా తినడం ద్వారా కూడా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. పాలలో చక్కెర వేసి పిల్లిపీచర వేళ్ల పొడిని అందులో వేయడం ద్వారా కూడా బలంగా మారవచ్చు.

    Also Read: నిమ్మగడ్డి సాగుతో సులువుగా లక్షల్లో సంపాదించవచ్చు.. ఎలా అంటే?
    ప్రతిరోజూ పాలలో చక్కెర కలుపుకొని అందులో దాల్చిన చెక్క పొడిని వేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. ఇలా చేయడం ద్వారా జీర్ణశక్తి పెరిగి శరీరం పుష్టిగా ఉండటంతో పాటు బక్కగా ఉన్నవాళ్లు బలంగా మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శిలాజిత్యాదియోగం ఔషధంను రోజూ తాగడం ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

    అల్లం, శొంఠితో చేసినా ఆహార పదార్థాలను తినడం ద్వారా ఆకలి పెరుగుతుందని చెప్పవచ్చు. శొంఠి, జీలకర్ర, ధనియాలను దంచి రోజూ అన్నంలో కలిపి తీసుకోవడం ద్వారా ఆకలి పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

    Also Read: తక్కువ ఖర్చుతో ఆరోగ్యం పొందాలా ? ఐతే ఈ పండు తినండి !