Lemon Grass: ఈ మధ్య కాలంలో రైతులకు చాలా పంటలు తీవ్రస్థాయిలో నష్టాలను మిగులుస్తున్నాయి. రోజురోజుకు పెట్టుబడులు పెరుగుతుండగా రైతులకు పెట్టుబడులకు సరిపడా ఆదాయం మాత్రం రావడం లేదు. ఏ పంట వేసినా నష్టపోతున్నామని చాలామంది రైతులు చెబుతుండటం గమనార్హం. అయితే నిమ్మగడ్డి సేద్యం ద్వారా సులభంగా లక్షల్లో సంపాదించవచ్చు. ఈ పంట సాగు వల్ల నెలకు కనీసం 45 వేల రూపాయలు మిగులుతుంది.
నిమ్మగడ్డి నుంచి తీసే నూనెను లీటర్ 1,000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు విక్రయించవచ్చు. ఎలాంటి ప్రత్యేకమైన ఎరువులు వినియోగించకుండానే నిమ్మగడ్డిని సాగు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మెట్ట ప్రాంతాలు, బీడువారిన ప్రాంతాలు నిమ్మగడ్డి సాగుకు అనుకూలమైన నేలలు అని చెప్పవచ్చు. ఆరు నుంచి ఏడుసార్లు ఈ మొక్కను కోసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: తక్కువ ఖర్చుతో ఆరోగ్యం పొందాలా ? ఐతే ఈ పండు తినండి !
ప్రత్యేకమైన యంత్రం సహాయంతో నిమ్మగడ్డి నుంచి నూనెను తీసే అవకాశం ఉంటుంది. నూనె ఎక్కువ ధర పలుకుండటంతో ఈ పంటను సాగు చేయడం ద్వారా సులువుగా మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వ్యవసాయ అధికారులను సంప్రదించి నిమ్మగడ్డి సాగుకు సంబంధించిన మెలుకువలను సులభంగా తెలుసుకోవచ్చు.
ఫిబ్రవరి నుంచి జులై ఈ పంట వేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు ఉండే నిమ్మగడ్డిని హెర్బల్ ప్రాడక్ట్స్ తయారీ కోసం వినియోగిస్తారు. నిమ్మగడ్డి సాగుతో ఖర్చుకు మించి లాభాలను అందుకోవచ్చు.
Also Read: డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తింటే అస్సలు వదిలిపెట్టరు!