BEML Recruitment 2022: బీఈఎంఎల్ అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. హెచ్ఆర్, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ విభాగాలతో పాటు ఆర్ అండ్ డీ, ప్లానింగ్, మార్కెటింగ్ (ఆర్ అండ్ ఎం) ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 25 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 50,000 రూపాయల నుంచి 2,40,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?
అనుభవం, అన్ని అర్హతలు ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకున్న ఓబీసీ అభ్యర్ధులకు మాత్రం 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.
https://www.bemlindia.in/default.aspx లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉండనుంది.
Also Read: హైదరాబాద్ బీడీఎల్‌లో 82 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?