
శ్రీకృష్ణుని చూడగానే వెంటనే గుర్తుకు వచ్చేది నీలిరంగు మొహం, చేతిలో పిల్లనగ్రోవి, తలపై నెమలి పించం, చుట్టూ పదహారు వేలమంది గోపికలతో ఎంతో అల్లరి చేస్తూ కనిపిస్తాడు. శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఎన్నో అల్లరి పనులు చేస్తూ అందరిని ఎంతో సరదాగా ఆటపట్టిస్తూ ఉండేవాడు. ఇంతటి అల్లరి చేష్టలు కలిగిన కన్నయ్య తలపై నెమలి పించం ఉంటుంది. అయితే ఆ నెమలి పింఛం ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?ఆ విధంగా శ్రీ కృష్ణుడు తలపై నెమలి పించం పెట్టుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
Also Read: జనవరి లో పుట్టిన వారికి వంకాయ రంగు అదృష్టమేనా..?
శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో కేవలం సరస సల్లాపాలు మాత్రమే ఆడాడు, ఎప్పుడూ కూడా వారి విషయంలో హద్దులు దాటి ప్రవర్తించలేదు. తను ఎంతో అల్లరి చేస్తూ ఎంతోమందిని ఆటపట్టించే వాడు. ఈ విధంగా కృష్ణుడు, గోపికల మధ్య ఉన్నది కేవలం ఒక పవిత్రమైన స్నేహం మాత్రమే కృష్ణుడు భోగి రూపంలో కనిపించే ఒక యోగి అని చెప్పవచ్చు.
Also Read: తెలంగాణలోని ఆ జిల్లాలో గోమాతకు శ్రీమంతం.. ఫోటో వైరల్..!
ఈ విధంగా తన అల్లరి చేష్టలతో ఎంతోమందిని ఆకట్టుకున్న శ్రీ కృష్ణుడు తన తలపై ఉన్న నెమలిపింఛం విషయానికి వస్తే ప్రపంచంలోనే సంభోగం చేయని జీవిగా నెమలిని చెప్పవచ్చు. అదేవిధంగా పదహారు వేల మంది గోపికలు ఉన్నా శ్రీకృష్ణుడు కూడా ఎంతో పరమ పవిత్రుడు అని భావించి నెమలి పించాన్ని శ్రీకృష్ణుడి తలపై ధరించాడు. ఈ నెమలి పించం శ్రీకృష్ణుడు తలపై ధరించడం వల్ల అతని పవిత్రతను తెలియజేస్తుంది. అంతేకాకుండా నెమలిని ఒక పవిత్రమైన పక్షిగా మన హిందువులు భావిస్తారు. నెమలి పించం మన ఇంటిలో ఉండటం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు.
మరిన్ని వార్తలు కోసం: కలెక్షన్స్