దేశానికి వెన్నెముక రైతు అంటారు. మరి అలాంటి రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డట్టు చరిత్రలో ఉన్నాయా..? సరిగ్గా ఇప్పుడు మోడీ ప్రభుత్వం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లు తనకంటూ తిరుగులేని నేతగా కొనసాగుతున్న మోడీకి ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటివరకు ఆయన చేసిన ఏ చట్టమైనా సాఫీగా అమల్లోకి రావడాన్నే చూశాం. కానీ.. ఫస్ట్ టైమ్ ఆయన యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read: కరోనాపై పని చేయని వ్యాక్సిన్.. 12,000 మందికి పాజిటివ్..?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై మొదటి సారి మోడీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ చట్టాలపై రైతులు దాదాపు విజయం సాధించారు. చట్టాలను అడ్డదారుల్లో ఆమోదించుకున్న మొండి కేంద్ర ప్రభుత్వం దిగి రాకతప్పలేదు. ఇది ప్రతిపక్షాలు, న్యాయస్థానాలు సాధించిన విజయం కాదు. ప్రజా విజయమనే చెప్పాలి. ఢిల్లీలో రైతులు అకుంఠిత దీక్షతో చేసిన పోరాట ఫలితం ఇది. ప్రభుత్వానికి ఎంత మెజార్టీ ఉన్నప్పటికీ ప్రజాందోళనకు తలవంచక తప్పదన్న సత్యం మరోసారి నిరూపితమైంది. రద్దు అన్న రాజకీయ అపవాదు తనపై పడకుండా పరువు దక్కించుకునే క్రమంలో భాగంగానే ఏడాదిన్నర పాటు చట్టాల నిలిపివేత అనే మధ్యే మార్గాన్ని కేంద్రం ఎంచుకోవాల్సి వచ్చింది.
తాము చేసిన చట్టాలపై తమను సుప్రీం కోర్టు ఆదుకుంటుందని కేంద్రం చాలా వరకు ఆశలు పెట్టుకుంది. రైతుల ఆందోళనలు మొదలైన నాటి నుంచి న్యాయస్థానం ప్రస్తావనను కేంద్రమే తెస్తోంది. చట్టాలను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలంటూ రైతులకు సూచించింది. కానీ.. కోర్టులు చట్టాల రాజ్యాంగ బద్ధతను చూస్తాయే తప్ప ప్రజా ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక తీర్పులు ఇవ్వవు. పైపెచ్చు మెజార్టీ ఆమోదంతో పార్లమెంటు చేసిన చట్టాలను అడ్డగోలుగా కొట్టేయడానికి సాహసించవు. అందుకే సుప్రీం కోర్టు ఎలాగూ చట్టాలపై సానుకూలతను కనబరుస్తుంది కాబట్టి తమకేం కాదనే ధీమాను కేంద్రం తొలుత చూపింది. రానురానూ రైతుల ఆందోళనలు తీవ్రం కావడంతో తీర్పు కాకపోయినా ఏదో ఒక కమిటీ రూపంలో న్యాయస్థానం బయటపడేస్తుందని ఆశించింది. దానికి రైతు సంఘాలు సానుకూలత కనబరచలేదు. కమిటీలో ప్రాతినిధ్యం వహించే సభ్యుల గత దృక్పథాన్ని ప్రశ్నించారు. దీంతో న్యాయస్థానమూ ఆలోచనలో పడింది.
Also Read: మీ సిమ్ కార్డ్ బ్లాక్ అయిందా.. ఈ తప్పు చేస్తే అంతే సంగతులు..?
ఓ వైపు చలి.. మరోవైపు వాన.. అయినా వెరవకుండా రైతులు తమ ఆందోళన కొనసాగించారు. వారిని రెచ్చగొట్టే చర్యలకు రకరకాల శక్తులు పూనుకున్నాయి. ఇందులో రాజకీయాలది కూడా ప్రధానపాత్రే. రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్ల ర్యాలీ చేస్తామని చేసిన హెచ్చరిక ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది. దేశరాజధానిని చేర్చి ఉన్న హర్యానా, పంజాబ్ ల నుంచి రైతులు వేలాదిగా ట్రాక్టర్లపై ముట్టడికి బయలు దేరితే అదుపు చేయడం కష్టం. బలవంతంగా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే హింసకు దారి తీయవచ్చు. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుంది.
దేశవ్యాప్తంగా రైతాంగంలో అలజడికి దారి తీస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ర్యాలీపై సుప్రీం నిర్ణయం వెలువరించాలంటూ తెలివిగా న్యాయస్థానాన్ని వివాదంలోకి లాగాలని ప్రయత్నించింది ప్రభుత్వం. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ర్యాలీని నిషేధించి తమ చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలని ప్రయత్నించింది. చివరకు సుప్రీం కోర్టు కూడా హ్యాండిచ్చింది. ర్యాలీకి అనుమతులు, నిషేధాలు తమ పరిధిలోకి రావని పోలీసులే చూసుకోవాలంటూ సుప్రీం తిప్పికొట్టింది. మొత్తమ్మీద సుప్రీం కోర్టు తీర్పుతో చట్టాల అమలు నిలిచిపోయింది. రైతులు ఆందోళనను విరమించుకుంటే చట్టాలే ఏడాదిన్నరపాటు రద్దు అయిపోతాయి. అంటే దాదాపు ఈ ప్రభుత్వ హయాంలో ఇక పట్టాలకు ఎక్కడం కష్టమేననేది సుస్పష్టం.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Farmer unions reject modi govts offer to suspend farm reforms
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com