Urination : పురుషులు ఏ పొజిషన్‌లో మూత్ర విసర్జన చేయాలో మీకు తెలుసా?

యూరిన్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు రోజుకి ఎక్కువగా నీరు తాగాలి. ద్రవ పదార్థాలను, కొబ్బరి నీళ్లను తాగుతుండాలి. అలాగే ఇతరులతో శృంగారానికి దూరంగా ఉండాలి. లేకపోతే మీ ఇన్ఫెక్షన్ ఇతరులకి కూడా సోకే ప్రమాదం ఉంది.

Written By: NARESH, Updated On : September 29, 2024 7:58 pm

Urination

Follow us on

Urination : సాధారణంగా పురుషులు నిల్చుని మూత్ర విసర్జన చేస్తుంటారు. ఏ టాయిలెట్స్ దగ్గర చూసిన వారికి నిల్చుని మూత్ర విసర్జన చేసేవి ఎక్కువగా ఉంటాయి. అయితే పురుషులు నిల్చుని మూత్ర విసర్జన చేయడం మంచిదా? కూర్చుని మూత్ర విసర్జన చేయడం ఆరోగ్యానికి మంచిదా? అని కొంతమందికి సందేహం ఉంది. అయితే పురుషులు నిల్చుని మాత్రమే మూత్ర విసర్జన చేయాలని, అలా చేస్తేనే ఆరోగ్యం అని కొందరు అంటున్నారు. నిల్చుని చేయడం కంటే కూర్చుని చేయడం వల్ల పురుషులకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంత? కూర్చుని మూత్ర విసర్జన చేయాలా? నిల్చుని మూత్ర విసర్జన చేయాలో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

పురుషులు నిల్చుని లేదా కూర్చుని మూత్ర విసర్జన చేయడం రెండు ఆరోగ్యానికి మంచిదే. అయితే కొందరు పురుషులు ప్రొస్టేట్ గ్రంధి వాపుతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్లు మూత్ర విసర్జన సమయంలో సమస్యలు ఎదుర్కుంటారు. ఈ సమస్యతో బాధ పడేవాళ్లు కూర్చుని మూత్ర విసర్జన చేయడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు కూర్చోవడం వల్ల విసర్జన నాళంలో మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుంది. ప్రొస్టేట్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లు నిల్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. అదే కూర్చుని మూత్ర విసర్జన చేస్తే.. ఒత్తిడి తగ్గి ఫ్రీగా అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్‌ రాకుండా ఉండటంతో పాటు శృంగార సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు అయితే లేవు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని అబ్బాయిలు నిల్చోని అయిన మూత్ర విసర్జన చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈరోజుల్లో చాలామంది పురుషులు యూరిన్ సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే శంగార సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడేవారు శృంగార సమస్యలకు దూరంగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తుండాలి. మరీ ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉందనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాల. లేకపోతే మూత్ర పిండాల సమస్యలతో ఎదుర్కొవలసి వస్తుంది. ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు.. నీరు ఎక్కువగా తీసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకోకూడదు. పరిశుభ్రత పాటిస్తుండాలి. అప్పుడే కొంతవరకు ఇన్ఫెక్షన్‌ను తగ్గించవచ్చు. లేకపోతే సమస్య తీవ్రత పెరిగి.. దుర్వాసన, దురద వంటివి ఏర్పడతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు రోజుకి ఎక్కువగా నీరు తాగాలి. ద్రవ పదార్థాలను, కొబ్బరి నీళ్లను తాగుతుండాలి. అలాగే ఇతరులతో శృంగారానికి దూరంగా ఉండాలి. లేకపోతే మీ ఇన్ఫెక్షన్ ఇతరులకి కూడా సోకే ప్రమాదం ఉంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.