https://oktelugu.com/

protein : అధిక ప్రొటీన్ కూడా ఆరోగ్యానికి ప్రమాదమేనా?

మీరు కేవలం ప్రొటీన్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మలబద్దకం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ ప్రొటీన్ తీసుకోకుండా బాడీకి సరిపడా ప్రొటీన్ మాత్రమే తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 30, 2024 / 03:04 AM IST

    Protein powder

    Follow us on

    protein : శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ తప్పనిసరి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఏ పదార్థం అయిన కూడా మితంగానే తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అవసరానికి మించి ప్రొటీన్ తీసుకుంటే తప్పకుండా ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కండరాలు బలంగా పెరగడానికి, స్ట్రాంగ్‌గా ఉండటానికి ప్రొటీన్ తప్పనిసరి. కానీ ఎక్కువగా ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక ప్రొటీన్ వల్ల మూత్రపిండాలు, కాలేయంపై ఒత్తిడిని తీసుకొస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరానికి రోజుకి ఎంత ప్రొటీన్ అవసరమో అంతే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సాధారణంగా పురుషులు అయితే రోజుకి 56 గ్రాములు, స్త్రీలు అయితే 46 గ్రాముల ప్రొటీన్ మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే తప్పకుండా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎక్కువగా ప్రొటీన్ తీసుకోవడం వల్ల వచ్చే ఆ సమస్యలేంటో చూద్దాం.

    బోలు ఎముకల వ్యాధి
    ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనం అవుతాయి. దీంతో బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్ వల్ల కండరాలు, ఎముకలు బలంగా మారుతాయి. కానీ అది మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే. అధికంగా తీసుకుంటే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

    కిడ్నీ స్టోన్స్
    అధిక ప్రొటీన్ వల్ల కొందరికి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. దీంతో సమస్య తీవ్రత పెరుగుతుంది. ప్రొటీన్ ఆరోగ్యానికి మంచిదే అని అధికంగా తీసుకుంటారు. కానీ దీనివల్ల అనుకూల కంటే ప్రతికూల అంశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రోజుకి మితంగా మాత్రమే ప్రొటీన్ తీసుకోవడం మేలు.

    క్యాన్సర్
    ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు ప్రొటీన్ కోసం పౌడర్లు కూడా వాడుతారు. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    బాడీ డీహైడ్రేషన్
    ఎక్కువగా ప్రొటీన్ తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. కాబట్టి ప్రొటీన్ తక్కువగా తీసుకుంటూ నీరు ఎక్కువగా తీసుకోవాలి.

    నోటి దుర్వాసన
    అధిక ప్రొటీన్లు శ్వాసలో వాసనకు కారణమవుతుంది. దీంతో శరీరంలోని అమైనో ఆమ్లాలు విచ్ఛిన్నం అవుతాయి. దీంతో నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంది.

    మలబద్దకం
    ఫైబర్ తక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. అయితే ప్రొటీన్ ఎక్కువగా ఉండే కొన్ని పదార్థాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. మీరు కేవలం ప్రొటీన్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మలబద్దకం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ ప్రొటీన్ తీసుకోకుండా బాడీకి సరిపడా ప్రొటీన్ మాత్రమే తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.