https://oktelugu.com/

sea fish : పక్షి లాగా రెక్కలు.. పీతలాగా బహుళ కాళ్లు..ఈ సముద్ర చేపల గురించి తెలుసా?

ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో జంతువులున్నాయి. ముఖ్యంగా సముద్రంలో మనిషికి తెలియని కోట్లాది జాతులు ఉన్నాయి. అందులో ఒక జాతికి చెందిన చేప శాస్త్రవేత్తలను ఆకట్టుకుంటున్నది.

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2024 / 01:02 AM IST

    Do you know about this sea fish

    Follow us on

    sea fish : ఆ చేపను శాస్త్రవేత్తలు సముద్రపు రాబిన్ అని పిలుస్తున్నారు. దానికి పక్షి మాదిరిగా రెక్కలు ఉన్నాయి. పీతకు మాదిరిగా బహుళ కాళ్ళు ఉన్నాయి. దీనిని శాస్త్రవేత్తలు 2016 వేసవి కాలంలో మొదటిసారిగా చూశారు. అనేక జంతువుల సమహారంగా ఆ చేపలు ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ చేపలపై ఉన్న రెక్కల లాంటి నిర్మాణాలు జ్ఞానేంద్రియాలుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తల పరిశోధన లో తేలింది. పీతల మాదిరిగా సముద్రపు రాబిన్ లకు బహుళ కాళ్లు ఉన్నప్పటికీ.. అవి ఒకే ఆకృతిలో లేవు. అయితే ఈ కాళ్ళను అవి ఒక్కొక్కటిగా కదిలించగలవు. అవి వాటి కాళ్ళను ఉపయోగించి సముద్ర అంతర్భాగాన్ని కొంత మొత్తంలో తవ్వుతాయి. పరిశోధకులు కొన్ని సముద్రపు రాబిన్ లను తీసుకొచ్చి ప్రయోగించారు.. అక్వేరియంలో వానపాములను మట్టితో కప్పిపెట్టి.. అందులో సముద్రపు రాబిన్ లను వేశారు. ఆహార అన్వేషణలో భాగంగా సముద్రపు రాబిన్ లు వాసన పసిగట్టి.. నేరుగా అక్వేరియం అడుగుభాగానికి వెళ్ళాయి. తమ కాళ్లతో వానపామును మట్టితో కప్పి పెట్టిన ప్రాంతానికి వెళ్లి.. తమ కాళ్లతో తవ్వాయి.. ఆ తర్వాత వానపామును తినడం మొదలుపెట్టాయి. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురయ్యారు..”సముద్రపు రాబిన్లు సింగిల్ అమైనో ఆమ్లాలను కూడా వెలికితీస్తాయని” వెల్లడించారు.

    శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం

    శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఫ్రీయో నోటస్ కరోలినస్ అనే జాతికి చెందిన సముద్రపు రాబిన్లు సముద్రం అడుగుభాగానికి వెళ్లేందుకు తమ కాళ్ళను ఉపయోగించాయి. ఉపరితలంపై తక్షణమే ఆహారాన్ని స్వీకరించాయి.. ఇందులో కొన్ని జాతులు మాత్రం అంత త్వరగా సముద్రం అడుగు భాగంలోకి వెళ్లలేకపోతున్నాయి. ఆహారాన్ని త్వరగా స్వీకరించలేకపోతున్నాయి. అయితే సముద్రపు రాబిన్ లలో భిన్నమైన జాతులు ఉన్నాయని తెలుస్తోంది.. సముద్రపు రాబిన్లలో పాపిల్లే ఆమె నిర్మాణం ఉంటుంది. ఇది మనిషి నాలుకలోని టేస్ట్ బడ్స్ లాగా సముద్రపు రాబిన్లకు ఉపకరిస్తుంది. అయితే ఈ సముద్రపు రాబిన్లు ఎక్కువగా న్యూ ఇంగ్లాండ్ లోని నది జలాలు.. అట్లాంటిక్ సముద్ర తీరం వంటి ప్రాంతాల్లో మాత్రమే శాస్త్రవేత్తలకు కనిపించాయి. సముద్రపు రాబిన్లలో అనిక్ గీర్సన్ వంటి జాతి లో విభిన్నమైన అవయవాలు ఉన్నాయి. అవి స్థూల ఇంద్రియాలు కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి పర్యావరణాన్ని అంచనా వేయడానికి వాటికి ఉపకరిస్తాయని తెలుస్తోంది. సముద్రపు రాబిన్లు టీబీఎక్స్ 3a అనే రెగ్యులేటరీ జన్యు ఆధారంగా సముద్రపు అంతర్భాగాన్ని తవ్వుతాయని తెలుస్తోంది. కొన్ని రకాల సముద్రపు రాబిన్లు సువాసనను వెదజల్లుతాయి. వాటిని సౌందర్య ఉత్పత్తుల తయారీకి ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇంకా కొన్ని సముద్రపు రాబిన్లు క్యాన్సర్ నివారణలో ఉపయోగించే ఔషధాల తయారీకి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.