షుగర్ వ్యాధిగ్రస్థులు తీపి పదార్థాలు తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

మన దేశంలో 7 కోట్ల కంటే ఎక్కువమంది షుగర్ వ్యాధి వల్ల బాధ పడుతున్నారు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బద్ధకం, బరువు తగ్గడం, కంటిచూపు మందగించడం, దాహం ఎక్కువగా వేయడం, అతిమూత్రం డయాబెటిస్ లక్షణాలుగా ఉన్నాయి. ఒక్కసారి షుగర్ బారిన పడితే తగ్గే అవకాశం ఉండదు. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఈ వ్యాధి బారిన పడే ఛాన్స్ ఉంటుంది. మధుమేహం బారిన పడిన […]

Written By: Kusuma Aggunna, Updated On : November 3, 2021 7:28 am
Follow us on

మన దేశంలో 7 కోట్ల కంటే ఎక్కువమంది షుగర్ వ్యాధి వల్ల బాధ పడుతున్నారు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బద్ధకం, బరువు తగ్గడం, కంటిచూపు మందగించడం, దాహం ఎక్కువగా వేయడం, అతిమూత్రం డయాబెటిస్ లక్షణాలుగా ఉన్నాయి. ఒక్కసారి షుగర్ బారిన పడితే తగ్గే అవకాశం ఉండదు. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఈ వ్యాధి బారిన పడే ఛాన్స్ ఉంటుంది.

మధుమేహం బారిన పడిన వాళ్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే శరీరంలో ఉండే ప్రతి అవయవం దెబ్బ తినే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది చక్కెర ఎక్కువ తినడం వల్ల డయాబెటిస్ బారిన పడతామని భావిస్తారు. అయితే చక్కెర తినడంతో పాటు ఇతర కారణాల వల్ల కూడా డయాబెటిస్ బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం వంశపారంపర్యంగా కూడా డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. శరీరంలో సరైన మోతాదులో ఇన్సులిన్ రిలీజ్ కాకపోయినా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అధిక బరువు, ఊబకాయం వల్ల కూడా షుగర్ బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ శరీరంలో పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

గంటల తరబడి కూర్చుని ఉండటం, శారీరక శ్రమ పూర్తిగా లేకపోవడం వల్ల కూడా షుగర్ బారిన పడే అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్థులు తీపి పదార్థాలు ఎప్పటికీ తినకూడదని చెప్పడం అపోహ మాత్రమేనని శాస్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు.