నిరుద్యోగులకు ఐబీపీఎస్ శుభవార్త.. 1828 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. 1828 ఉద్యోగ ఖాళీల కోసం తాజాగా ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ibps.in వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ 3వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా నవంబర్ 23వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 2021 […]

Written By: Kusuma Aggunna, Updated On : November 3, 2021 6:59 am
Follow us on

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. 1828 ఉద్యోగ ఖాళీల కోసం తాజాగా ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ibps.in వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ 3వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా నవంబర్ 23వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

2021 సంవత్సరం నవంబర్ 23వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వచ్చే నెల 26వ తేదీన పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 26వ తేదీన జరగనుండగా 2022 సంవత్సరం జనవరి నెల 30వ తేదీన మెయిన్స్ పరీక్ష జరగనుంది. అధికారిక వెబ్ సైట్ లో ఉన్న నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 1828 ఉద్యోగ ఖాళీలలో స్పెషలిస్ట్ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు 220 ఉద్యోగాలు, ఐటీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 220 ఉద్యోగాలు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 884 ఉద్యోగ ఖాళీలు, మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 535, హెచ్‌ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు 61, లా ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 44 ఉద్యోగ ఖాళీలు, రాజభాష అధికారి ఉద్యోగ ఖాళీలు 84 ఉన్నాయి.

20 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్లను బట్టి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 850 రూపాయలు, మిగిలిన అభ్యర్థులకు 175 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది.