https://oktelugu.com/

Virat Kohli: వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీ ఔట్..త్వరలో బీసీసీఐ సంచలన నిర్ణయం?

Virat Kohli: ద్వైపాక్షిక సిరీస్ లలో అదరగొడుతున్న టీమిండియా తీరా ప్రపంచకప్ ల వరకు వచ్చేసరికి తేలిపోతోంది. అస్సలు ఆటగాళ్లలో పట్టుదల కొరవడుతోంది. యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో దాయాది పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్ లోనూ న్యూజిలాండ్ చేతిలో చిత్తయ్యింది. వార్మప్ మ్యాచ్ లలో ఇరగదీసిన ఆడిన మన ఆటగాళ్లలో అసలు మ్యాచ్ లు వచ్చేసరికి ఏమైందన్నది అంతుబట్టడం లేదు. టీమిండియా ప్రేక్షకులను, బీసీసీఐని పూర్తిగా నిరాశపరిచారు. టోర్నీ నుంచి […]

Written By: , Updated On : November 3, 2021 / 08:52 AM IST
Follow us on

Virat Kohli: ద్వైపాక్షిక సిరీస్ లలో అదరగొడుతున్న టీమిండియా తీరా ప్రపంచకప్ ల వరకు వచ్చేసరికి తేలిపోతోంది. అస్సలు ఆటగాళ్లలో పట్టుదల కొరవడుతోంది. యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో దాయాది పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్ లోనూ న్యూజిలాండ్ చేతిలో చిత్తయ్యింది. వార్మప్ మ్యాచ్ లలో ఇరగదీసిన ఆడిన మన ఆటగాళ్లలో అసలు మ్యాచ్ లు వచ్చేసరికి ఏమైందన్నది అంతుబట్టడం లేదు. టీమిండియా ప్రేక్షకులను, బీసీసీఐని పూర్తిగా నిరాశపరిచారు. టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టైంది.

Virat Kohli:

Virat Kohli:

టీమిండియాకు మెంటార్ గా ధోని ఉన్నా.. కోచ్ రవిశాస్త్రి చెప్పినా మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయాలే దీనికి ముఖ్య కారణమని పలువురు మాజీలు విమర్శకులు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇప్పటికే కోహ్లీ టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు గతంలోనే ప్రకటించాడు. ఇఫ్పుడు అతడి నుంచి వన్డే కెప్టెన్సీ కూడా తీసుకోవాలని బీసీసీఐ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. టీ20, వన్డేలకు ఒకే కెప్టెన్ ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఒక్క ప్రపంచకప్ కూడా సాధించలేదు. ప్రస్తుతం ప్రపంచకప్ లోనూ పేలవ ప్రదర్శన చేసింది. దీనిపై బీసీసీఐ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించాలని బీసీసీఐ యోచిస్తోందని ఒక అధికారి జాతీయ మీడియాకు తెలిపారు.

త్వరలోనే రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో సెలెక్టర్లు జట్టు కూర్పుపై కసరత్తులు మొదలుపెడుతారని సమాచారం. సెలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు కెప్టెన్ పై తుది నిర్ణయం తీసుకుంటారు.

ప్రస్తుతానికి టీ20, వన్డేలకు రోహిత్ శర్మను లేదా మరెవరినైనా కెప్టెన్ గా నియమించి టెస్టులకు విరాట్ కోహ్లీని కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందట.. మరి దీనిపై టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.