Sleeping After Sunrise : మారిన జీవనశైలి వల్ల ఈరోజుల్లో చాలా మంది సూర్యోదయం అయిన తరువాత నిద్ర లేస్తున్నారు. కొందరు అయితే సూర్యోదయం అవుతుంది అంటే నిద్ర పోతున్నారు. పూర్వం రోజుల్లో అందరు వేకువ జామునే నిద్ర లేచేవారు. రాత్రి కూడా తొందరగా తిని నిద్రపోయేవారు. సూర్యోదయం కాకముందు లేవడం వల్ల రోజంతా ఫ్రెష్ గా ఉంటారు. బాడీ సిక్నెస్ లేకుండా యాక్టీవ్ గా ఉంటారు. అదే సూర్యోదయం తర్వాత లేస్తే.. రోజంతా చిరాకుగా ఉంటుంది. ఏ పని కూడా తొందరగా పూర్తి కాదు. అయితే సూర్యోదయం తరువాత లేస్తే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సూర్యోదయం కంటే బ్రహ్మ ముహర్తంలో నిద్ర లేచి యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే.. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయిన ఈరోజుల్లో చాలా మంది ఒత్తిడి, ఆందోళన వల్ల లేట్ గా నిద్ర పోతున్నారు. అందరూ లేచే సమయానికి కొందరు నిద్రపోతున్నారు. మారుతున్న జీవన శైలి వల్ల ఎక్కువ మంది నైట్ షిఫ్ట్ లు చేస్తున్నారు. ఇలా లేట్ గా నిద్రపోయి.. సూర్యోదయం అయిన తరువాత లేవడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అదే సూర్యోదయానికి ముందు లేస్తే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సూర్యోదయానికి ముందే లేచి.. యోగా, వ్యాయామం వంటివి చేస్తే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అలాగే జీర్ణ క్రియ కూడా మెరుగ్గా పనిచేస్తుంది.
చాలా మంది సూర్య భగవానుని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కనిపించని దేవుళ్లు కంటే కనిపించే సూర్య భగవానుని కొలిస్తే మంచిది. ఉదయాన్నే లేచి ఆ సూర్య కిరణాలను తాకితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. రాత్రిపూట ఎంత లేటుగా నిద్రపోయిన.. ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. పని ఉన్న లేకపోయినా ఉదయాన్నే లేచి రోజంతా ఏం చేయను ప్లాన్ చేసుకుంటే.. అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. లేటుగా లేస్తే ఏ పని కూడా తొందరగా పూర్తిగా కాదు. ఇంకో రోజు వరకు అది పెండింగ్ లోనే ఉండిపోతుంది. అందరూ ఏదైనా పని ఉంటే పొద్దున్నే తొందరగా లేస్తారు. ఉదయానికి ఆఫీస్, స్కూల్ కి వెళ్లాలని తొందరగా లేస్తారు. అదే సండే వచ్చిందంటే.. పది గంటల వరకు నిద్రపోతారు. పొద్దున్న నిద్ర లేవడం అలవాటు లేకపోయినా.. కష్టమైన అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజులు ఇలా అలవాటు చేస్తే అంత బాగానే జరుగుతుంది. లైఫ్ లో మంచి స్థాయిలో ఉండాలంటే వేకువ జామున లేవడం అలవాటు చేసుకోవడం మంచిది. లేటుగా లేస్తే రోజంతా ఆకలిగా ఉండదు. అదే తొందరగా లేస్తే ఆకలి వేస్తుంది. ఎంత బిజీగా ఉన్న సమయానికి తింటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.