https://oktelugu.com/

Boys- Grils : ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలు అంటే.. అమ్మాయిలకి మహా ఇష్టం అంటా!

ఎక్కువ మంది అమ్మాయిలు.. అబ్బాయిలో కొన్ని లక్షణాలు ఉంటే ఇష్టపడతారు. అబ్బాయిల్లో ఉండే ఆ క్వాలిటీస్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం. మరి ఆ క్వాలిటీస్ ఏంటో తెలియాలి అంటే ఆర్టికల్ మొత్తం చదివేయండి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 11, 2024 / 06:38 AM IST

    Girls Like This Boy

    Follow us on

    Boys- Grils :  ప్రేమ.. రెండు అక్షరాలే. కానీ పొందడం చాలా కష్టం. ఒక అబ్బాయిని ప్రేమించే ముందు అమ్మాయిలు చాలా సార్లు అలోచించి.. నిర్ణయం తీసుకుంటారు. అబ్బాయిలో ఉండే క్వాలిటీస్ ఏంటి? ఎలా ఉంటాడు? పేరెంట్స్ ను ఎలా చూసుకుంటాడు? తనని ఎలా చూసుకుంటాడు? అని అన్ని విషయాలు ఆలోచిస్తారు. అయితే ఎక్కువ మంది అమ్మాయిలు.. అబ్బాయిలో కొన్ని లక్షణాలు ఉంటే ఇష్టపడతారు. అబ్బాయిల్లో ఉండే ఆ క్వాలిటీస్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం. మరి ఆ క్వాలిటీస్ ఏంటో తెలియాలి అంటే ఆర్టికల్ మొత్తం చదివేయండి.

    ఎక్కువ టైం స్పెండ్ చేయడం
    అమ్మాయిలకి ఎక్కువగా అబ్బాయిలు టైం స్పెండ్ చేసే వాళ్లంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉన్నప్పుడు టైం స్పెండ్ చేసే పార్టనర్ కంటే.. ఎంత బిజీగా ఉన్న తనతో ఉండే పార్టనర్ ను అమ్మాయిలు చూస్తారు. అలాగే వాళ్ల ఎమోషన్స్ అర్ధం చేసుకుని కేర్ చూపించే అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.

    దయ, సాయ గుణం ఉన్నవాళ్లు
    అమ్మాయిలకి ఇంటి, వంట పనుల్లో సాయం చేసే అబ్బాయిలు అంటే చాలా ఇష్టం. అందులో వంట చేసే అబ్బాయిలు అంటే ఇంకా ఇష్టం. అమ్మాయిలని వాళ్ల ఇష్టాలను గౌరవించి.. అన్నిటిలో సపోర్ట్ గా ఉండే అబ్బాయిలు అంటేనే అమ్మాయిలకు ఇష్టం.

    లీడర్ షిప్ క్వాలిటీస్
    అబ్బాయిలు ఏం తెలియనట్టు ఉంటే అమ్మాయిలు అంతగా నచ్చరు. అన్నిటిని మ్యానేజ్ చేసే విధంగా ఉంటేనే నచ్చుతారు. డల్ గా ఉండి.. అన్నిటికి బయపడుతుంటే అమ్మాయిలు నచ్చరు. అబ్బాయిలు ధైర్యంగా ఉంటేనే ఎక్కువ మంది అమ్మాయిలు నచ్చుతారు.

    అన్ని విషయాలు పంచుకునేవాళ్లు
    మనసులో దాచుకోకుండా అన్ని విషయాలు షేర్ చేసుకునే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.

    కోపంతో కాకుండా నెమ్మదిగా మాట్లాడుకోవడం
    కొందరు అబ్బాయిలు మంచిగా ఉన్నప్పుడు ఒకలా.. గొడవ వస్తే ఒకలా ప్రవర్తిస్తారు. ఇలాంటి అబ్బాయిలని అమ్మాయిలు అసలు ఇష్టపడరు. కోపంలో మాటలతో హర్ట్ చేస్తారు. అమ్మాయిలు ఎప్పుడు నెమ్మదిగా మాట్లాడుకునే అబ్బాయిలనే ఇష్టపడతారు.

    గొడవలను పెద్దది చేయకుండా సాల్వ్ చేసుకోవాలి
    గొడవ అయితే వెంటనే కలిసి సాల్వ్ చేసుకోవాలి. అంతే కానీ కోపంతో పెద్దది చేసుకోకూడదు. మన వాళ్లే కదా అని ఈగో ఫీలింగ్ లేకుండా ఉండాలి. అప్పుడే బంధం బలపడుతుంది. బంధం కలిసి ఉండటానికి ప్రయత్నించే అబ్బాయిలను ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడతారు.