Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. అలాగే ఈరోజు ఆయుష్మాన్ యోగం ఏర్పడనుంది. దీంతో మేషం సహా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
వృషభ రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి.
మిథున రాశి:
కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అకస్మాత్తుగా ఓ చోట మీ డడ్బు ఇరుక్కుపోతుంది. వ్యాపారం చేసేవారు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి:
ఏ పని చేసినా నిర్లక్ష్యంగా ఉండకూడదు. జీవితంలో కొన్ని రంగాల వారు ఆర్థికంగా మంచి ప్రగతి సాధిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.
సింహ రాశి:
వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. సాయంత్రం శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. ఇంటి బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
కన్య రాశి:
వ్యాపారులు బిజీ వాతావరణంలో ఉంటారు. సీనియర్ల సహకారంతో ఉద్యోగులు టాస్క్ లను పూర్తి చేస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
తుల రాశి:
ఆర్థికంగా లాభాలు పొందుతారు. పిల్లల వివాహంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి:
ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉపాధ్యాయ రంగంలోని వారికి అన్నీ విజయాలే ఉంటాయి. ఆరోగ్యం విషయంలో పూర్తిగా శ్రద్ధ వహిస్తారు. ఇంట్లో ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది.
ధనస్సు రాశి:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. స్నేహితుల్లో ఒకరికి సాయం చేస్తారు.
మకర రాశి:
వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు ఆదాయం పెరగడానికి కొన్ని మార్గాలు పడుతాయి. సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉంటే వెంటనే పూర్తి చేయాలి.
కుంభరాశి:
కొన్ని పనులు అనుకోకుండా వాయిదా పడుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చరేస్తారు. కుటుంబంలో ఆదాయం పెరుగుతుంది.
మీనరాశి:
అనవసర వివాదాల్లో తలదూర్చొద్దు. చిక్కుల్లో పడుతారు. ఉన్నత విద్య కోసం దారులు పడుతాయి. కష్టపడి పనిచేసిన వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.