Health: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఎంత సంపాదించినా ఆరోగ్యంగా లేకపోతే అది పనికి రాదు. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. సమయానికి భోజనం చేయకుండా పనిలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారు. దీంతో మనకు జీవితంలో ఇబ్బందులు ఎదురవడం సహజం. కానీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే అది మనల్ని పట్టించుకోదు. దీంతో మనం రోగాల బారిన పడే అవకాశం ఉంది. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే కొన్ని లక్షణాలు ఉండాలి.
సరిగా ఆకలి వేయడం
సమయం ప్రకారం ఆకలి వేయాలి. మనకు తినాలనే కోరిక కలగాలి. బాగా ఆకలి వేస్తుందంటే మనం తిన్నది సరిగా జీర్ణం అవుతుందని తెలుసుకోవాలి. ఆకలి ఉంటేనే తినాలనే కోరిక పెరుగుతుంది. బాగా తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాని మనకు తినాలనే కోరిక కలగడం లేదంటే మనం ఆరోగ్యంగా లేనట్లే లెక్క. ఇది మొదటి లక్షణం.
సరిగా నిద్ర
ప్రతి మనిషికి రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. ఆరోగ్యవంతుడైన వ్యక్తి మంచి నిద్ర పోవాలి. లేకపోతే రోగాలు వచ్చినట్లే. సుఖవంతమైన నిద్ర మనిషి జీవితానికి ఎంతో సంబంధం ఉంటుంది. నిద్ర పోకపోతే అవయవాలు దెబ్బతింటాయి. ఫలితంగా అనారోగ్యం కలుగుతుంది. ఆరోగ్యవంతుడైన వ్యక్తికి నిద్ర కూడా అత్యవసరమే.
మలవిసర్జన
మలవిసర్జన ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి. ముక్కుతూ మూలుగుతూ మలవిసర్జన చేస్తే రోగం ఉన్నట్లే భావించుకోవాలి. దొడ్లో కూర్చోగానే సాఫీగా జరిగిపోవాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా పని కానిచ్చేయాలి. ఆరోగ్యవంతుడి లక్షణాల్లో ఇది కూడా ముఖ్యమైనదే. మనం తిన్నది జీర్ణం అయితే బయటకు రావడానికి కూడా ఇబ్బంది ఉండదు.
నడుము చుట్టు కొలత
మన నడుము చుట్టు కొలత చాతీ చుట్టు కొలత కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ నడుము చుట్టు కొలత చాతీ చుట్టు కొలత కంటే ఎక్కువగా ఉంటే అనారోగ్యమే. దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఆరోగ్యవంతుడి నడుము సన్నగానే ఉండాలి. నడుము చుట్టు కొలత పెరిగిందంటే కొవ్వు పెరిగిందని తెలుసుకోవాలి. ఇది అనారోగ్య లక్షణమే. దీంతో మనం జాగ్రత్తగా ఉండాలి.
పనిలో ఉత్సాహం
ఎప్పుడు కూడా మన చేసే పనిలో నిరుత్సాహం రాకూడదు. ఎల్లప్పుడు ఉత్సాహంతో పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. చేసే పనిలో నిరుత్సాహం ఆవహిస్తే మన ఆరోగ్యంగా లేనట్లే. ఇలా మనం చేసే పనులను బట్టి మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. చేసే పనిలో ఉత్సాహం ఉరకలేస్తే మన ఆరోగ్యం బాగా ఉన్నట్లు. లేదంటే అనారోగ్యం ఆవహించినట్లే.