Test Tube Baby: ఆ దంపతులకు పెళ్లి జరిగి చాలా సంవత్సరాలయింది. అయినప్పటికీ పిల్లలు కలగలేదు. ఆ దంపతులు సంతాన ప్రాప్తిని పొందడానికి అనేక ఆసుపత్రులు తిరిగారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని ఓ ట్యూబ్ సెంటర్ కు వెళ్లారు. అక్కడ ఆ మహిళ గర్భాశయంలో వీర్యం ఎక్కించే పని చేపట్టారు. విజయవంతంగా ఆమె గర్భాశయంలోకి వీర్యాన్ని ఎక్కించారు. ఆ తర్వాత అనేక వైద్య చికిత్సల తర్వాత ఆమె గర్భం దాల్చింది. 9 నెలలపాటు కడుపులో శిశువును మోసింది. అనంతరం పండంటి బాబుకు జన్మనిచ్చింది..
బాబుకు జన్మనిచ్చిన దగ్గరనుంచి అతడికి ఆరోగ్యం ఏ మాత్రం బాగుండడం లేదు. పైగా అతడు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో కంగారుపడిన తల్లిదండ్రులు అతనికి పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో అతడికి క్యాన్సర్ ఉన్నట్టు తెలింది. వాస్తవానికి ఆ దంపతుల కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేదు. ఈ నేపథ్యంలో కంగారుపడిన దంపతులు ఆ పిల్లాడికి డిఎన్ఏ పరీక్ష చేయించారు. డిఎన్ఏ పరీక్ష ఫలితాలు తల్లిదండ్రుల డిఎన్ఏ తో సరిపోలలేదు. దీంతో ఆ దంపతులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. పోలీసులకు జరిగిన విషయం తెలిపారు.
ఆ మహిళ గర్భాశయంలో ఆమె భర్తకు బదులుగా మరో వ్యక్తి వీర్యాన్ని చొప్పించారు. దీంతో ఆమె గర్భం దాల్చింది.. అందువల్లే పుట్టిన శిశువుకు క్యాన్సర్ సోకింది. ఆ వీర్యం ఇచ్చిన వ్యక్తికి డీఎన్ఏ లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని.. అందువల్లే ఆ శిశువులో క్యాన్సర్ లక్షణాలు కనిపించాయని ఆ దంపతులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ విషయంపై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు..
“మాకు పెళ్లయి చాలా సంవత్సరాలయింది. పిల్లలు లేకపోవడంతో అనేక ఆసుపత్రులు తిరిగాం. చివరికి ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు వచ్చాం. అక్కడ వారు రకరకాల వైద్య చికిత్సలు చేశారు. పుట్టిన శిశువు మొదటి నుంచి కూడా అనారోగ్యంతో ఉన్నాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్తే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని తేలింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కడుపు పండిందని సంతోషపడేలోపు.. ఆ కడుపులో బిడ్డకు ఈ వ్యాధి ఉందని తెలియడంతో మా గుండె పలుగుతోంది. మాకు తీరని వేదన మిగిల్చిన ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని” ఆ దంపతులు డిమాండ్ చేస్తున్నారు.