Hero Srikanth: తమిళ హీరో విజయ్ ఆంటోని బిచ్చగాడు మూవీతో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే. 2016లో విడుదలైన ఈ చిత్రం అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ట్రిపుల్ ప్రాఫిట్ ఇచ్చిన చిత్రం ఇది. పిచై కారన్ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో బిచ్చగాడు గా విడుదల చేశారు. విజయ్ ఆంటోని హీరోగా నటించి నిర్మించారు. మదర్ సెంటిమెంట్, లవ్ ట్రాక్, కామెడీ వర్క్ అవుట్ కావడంతో ఊహించని విజయం సాధించింది. విజయ్ ఆంటోనికి మంచి గుర్తింపు తెచ్చింది. శశి దర్శకుడిగా ఉన్నారు.
అయితే ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీకాంత్ చేయాల్సిందట. బిచ్చగాడు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నారట. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయట. విజయ్ ఆంటోని మహాత్మ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆ విధంగా శ్రీకాంత్-విజయ్ ఆంటోనికి పరిచయం ఉందట. దీంతో తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారట. నిర్మాత చదలవాడ తిరుపతిరావుతో మాట్లాడారట. తనకున్న ఇమేజ్ రీత్యా ఎమోషన్ డోస్ మరింత పెంచి తెరకెక్కించాలనుకున్నారట.
అయితే శ్రీకాంత్ రెమ్యూనరేషన్, బడ్జెట్ లెక్కలు చూస్తే అంచనాలు దాటిపోయాయట. దాంతో రీమేక్ ఆలోచన విరమించుకున్నారట. దీంతో డబ్బింగ్ వెర్షన్ విడుదల చేసి నిర్మాతలు క్యాష్ చేసుకున్నారు. ఈ విషయాలను శ్రీకాంత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను హిట్టుకు పొంగిపోయి ప్లాప్ కి కృంగిపోయే వ్యక్తిని కాదు. ఒక పరాజయం వచ్చినప్పుడు నెక్స్ట్ మంచి కథ, మంచి డైరెక్టర్ ని ఎంచుకోవాలని ఆలోచిస్తాను. అంతే కానీ బాధపడుతూ కూర్చోను, అని అన్నారు.
Hero Srikanth
ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాలు హీరోగా శ్రీకాంత్ స్టార్డమ్ అనుభవించారు. హీరోగా ఆయన ఫేడ్ అవుట్ అయ్యారు. దీంతో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ విలన్ రోల్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అఖండ మూవీలో కరుడుగట్టిన విలన్ రోల్ చేశారు. విజయ్ హీరోగా ఈ సంక్రాంతికి విడుదలైన వారసుడు చిత్రంలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఈ మార్గం ఎంచుకొని జగపతిబాబు సక్సెస్ఫుల్ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయంలో శ్రీకాంత్ ఆయన్ని ఫాలో అవుతున్నారు. మరో కొడుకు రోషన్ ని హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.