https://oktelugu.com/

‘పుష్ప’కి బిగ్ షాక్.. ఒకరు మృతి.. మరో 20 మందికి.. !

‘పుష్ప’ టీమ్ మొదటినుండి భయపడినట్టే జరిగింది. కరోనా పుష్పకు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో పుష్ప షూటింగ్ జరుగుతుండగా… ప్రొడక్షన్ టీంలో పనిచేసే ఓ వ్యక్తి చనిపోయిన దురదృష్ట సంఘటన అందరిని షాక్ కి గురిచేసింది. అయితే చనిపోయినవారికి ఇప్పుడు కరోనా టెస్ట్ చేస్తున్న క్రమంలో.. చనిపోయిన ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కి కూడా కరోనా టెస్ట్ చేశారు. కాగా అతనికి కరోనా అని తేలింది. Also Read: పవన్, మహేష్ కలిస్తే.. బాక్సాఫీస్ […]

Written By:
  • admin
  • , Updated On : December 3, 2020 / 08:39 PM IST
    Follow us on


    ‘పుష్ప’ టీమ్ మొదటినుండి భయపడినట్టే జరిగింది. కరోనా పుష్పకు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో పుష్ప షూటింగ్ జరుగుతుండగా… ప్రొడక్షన్ టీంలో పనిచేసే ఓ వ్యక్తి చనిపోయిన దురదృష్ట సంఘటన అందరిని షాక్ కి గురిచేసింది. అయితే చనిపోయినవారికి ఇప్పుడు కరోనా టెస్ట్ చేస్తున్న క్రమంలో.. చనిపోయిన ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కి కూడా కరోనా టెస్ట్ చేశారు. కాగా అతనికి కరోనా అని తేలింది.

    Also Read: పవన్, మహేష్ కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే !

    దాంతో టీం మొత్తం హడావిడిగా టెస్ట్ చేయించుకోగా.. ఇప్పటికే పుష్ప టీమ్ లో మొత్తం 20 మందికి కరోనా సోకిందని రిపోర్ట్స్ వచ్చాయి. దాంతో సడెన్ గా షూటింగ్ ని రద్దు చేసుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చేసింది పుష్ప టీమ్. అసలు ఒక్కసారిగా ఇంతమందికి కరోనా ఎలా సోకిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా ఇంకా ఎంతమందికి కరోనా వస్తుందో అని టెన్షన్ పడుతున్నారు.

    Also Read: “సలార్” దెబ్బకు ప్రభాస్ సినిమాల రాక మారింది !

    మరో వారం, పది రోజుల వరకు లక్షణాలు బయటపడవు కాబట్టి… ఆ తరువాతే క్లారిటీ రానుంది. అయితే అల్లు అర్జున్ కొంత వరకు సేఫ్ అని.. ఆ టీం మెంబర్ బన్నీతో ఎప్పుడూ ఇంటరాక్షన్ జరగలేదని తెలుస్తోంది. కాకపోతే సుకుమార్, ఇతర మెయిన్ టీం మొత్తం ఇప్పుడు ఐసోలేషన్ లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మరో వారం పాటు ఎవరిని కలవొద్దు అని సుకుమార్ అండ్ ఆయన టీమ్ నిర్ణయించుకుంది. మొత్తానికి పుష్ప టీమ్ కి ఇది పెద్ద షాకే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్