Washing Clothes Without Soap: ప్రస్తుతం బట్టలు ఉతకాలంటే అందరూ మార్కెట్‌లో లభించే రకరకాల సబ్బుల్లో ఏదో ఒకటి కొనుక్కుని యూజ్ చేస్తన్నారు. ఇకపోతే మార్కెట్ లో బోలెడన్ని బట్టల సబ్బులు వచ్చాయి కూడా. అయితే, ఒకప్పుడు ఈ సబ్బులు కాని సర్ఫ్‌లు కాని మార్కెట్‌లో అవెయిలబుల్‌గా లేవు. ఈ బట్టలను ఇండియన్ మార్కెట్‌లో ఎవరు ప్రవేశపెట్టారంటే.. ఇండియాను పాలించిన బ్రిటీష్ వాళ్లు 130 ఏళ్ల కిందట ఆధునిక సబ్బును ఇండియాలో ప్రవేశపెట్టారు. ఇంగ్లాండ్‌కు చెందిన లీబర్ బ్రదర్స్ సోప్ ఇంట్రడ్యూస్ చేశారు. అలా బ్రిటన్ నుంచి భారత్‌కు సబ్బులు దిగుమతి అయ్యేవి. ఇకపోతే ఈ క్రమంలోనే బ్రిటీష్ వారు మీరట్‌లో సబ్బుల కర్మాగారం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇండియాలో టాటా కంపెనీ ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.
ఇకపోతే ఈ సబ్బులు రాకమునుపు భారతదేశంలో తొలిసారిగా సబ్బులను ఎప్పుడు ఉపయోగించారనే విషయమై చాలానే చరిత్ర ఉంది. భారతదేశంలో వృక్షసంపద సమృద్ధిగా ఉండేది. కానీ, కాల క్రమేణా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే వృక్షాల ద్వారా పూర్వీకులు చాలా పనుల చేసేవారట. ఈ సంగతులు అలా ఉంచితే..పూర్వం బట్టలను శుభ్రం చేయడానికి కుంకుడు కాయలను ఉపయోగించేవారు. రాజభవనాలలో కుంకుడు మొక్కలు నాటి వాటిని రక్షించేవారు కూడా. అలా కుంకుడుకాయల ద్వారా బట్టలను శుభ్రం చేసేవారు. ఖరీదైన వస్త్రాలను కూడా ఇలానే శుభ్రం చేసేవారు.
Also Read: డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తింటే అస్సలు వదిలిపెట్టరు!
ఇలా కుంకుడు కాయలతో బట్టలను శుభ్రంగా ఉతుక్కునేవారు. అయితే, ఇది కేవలం కుంకుడు కాయలు ఉంటేనే సాధ్యమయ్యే పని. రాజభవనాలలో ఇలా కుంకుడు కాయలతో వస్త్రాలను శుభ్రం చేసేవారు. అయితే, సామాన్యులకు ఈ అవకాశం లేదు. సామాన్యులు తమ బట్టలను వేడి నీళ్లలో వేసి మరిగించేవారు. అలా వేడినీళ్లలో కొద్ది సేపు మరిగిన తర్వాత బయటకు తీసి ఆరేసేవారు. అలా బట్టలను ఉతుక్కునేవారు పూర్వం.
కుంకుడు కాయ ద్వారా ఖరీదైన వస్త్రాలతో పాటు మృదువైన బట్టలను కూడా ఉతికేవారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొలాల్లలో చెరువుల ఒడ్డును దొరికే తెల్లటి రంగు పొడిని ఉపయోగించేవారు. అలా ఆ పొడిని ఉపయోగించి కూడా బట్టలను ఉతికేవారు. ఇక స్నానం విషయానికొస్తే భారతీయులు తమ శరీరంపై మట్టి, బూడిదను రుద్దుకున్న తర్వాత స్నానం చేసేవారు. ఇప్పటికీ కొందరు అలా చేస్తుండటం మనం చూడొచ్చు. పాత్రలను శుభ్రం చేయడానికి ఇప్పుడంటే విమ్, ఇతర డిష్ బార్లు వచ్చాయి. కానీ, అప్పట్లో బూడిద లేదా మట్టితోనే పాత్రలను శుభ్రం చేసేవారు ప్రజలు.
Also Read: కరోనా పట్ల ఆందోళన వద్దు.. అప్రమత్తతతో జాగ్రత్తలు ముద్దు..