ధూమపానం, మధ్యపానం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం ధూమపానం, మధ్యపానంకు అలవాటు పడటం వల్ల ఆ అలవాట్లను మానలేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఈ అలవాట్లను మానేయాలంటే సులభం కాదు. ఈ అలవాట్లను అలవరచుకుంటే మానేయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుందని సిగరెట్, మద్యానికి బానిసలైన వాళ్లు చెబుతుంటారు.
ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సిగరెట్ మానేసిన రెండు రోజుల తర్వాత అలసటగా ఉండటం, తల తిరగడం, విశ్రాంతి లేకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సిగరెట్ మానేసిన వాళ్లలో కొంతమందిని తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది. అయితే ఆ తర్వాత సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయి.
సిగరెట్ మానేసిన కొన్ని నెలల తర్వాత ఊపిరితిత్తులు బలంగా మారడంతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడే అవకాశం ఉంటుంది. సిగరెట్ మానేసిన వాళ్లు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సిగరెట్ మానేయడం ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గడంతో పాటు గుండె జబ్బులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.