https://oktelugu.com/

ఊబకాయంతో బాధ పడేవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ ఔషధంతో చెక్?

దేశంలో ఊబకాయంతో బాధపడే వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంది. ఊబకాయంతో బాధ పడేవాళ్లను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అమెరికాలో ఊబకాయం సమస్యతో బాధ పడేవాళ్లకు వీగోవీ పేరుతో ఔషధం అందుబాటులోకి వచ్చింది. నోవో నోర్డిస్క్ అనే ఔషధ సంస్థ ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఔషధానికి భారీగా డిమాండ్ నెలకొని ఉండటంతో డిమాండ్ కు తగినట్టుగా ఔషధాన్ని సప్లై చేసే విషయంలో సంస్థ ఫెయిల్ అవుతోంది. ఈ ఔషధం వినియోగం కోసం జూన్ నెలలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 6, 2021 / 08:54 AM IST
    Follow us on

    దేశంలో ఊబకాయంతో బాధపడే వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంది. ఊబకాయంతో బాధ పడేవాళ్లను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అమెరికాలో ఊబకాయం సమస్యతో బాధ పడేవాళ్లకు వీగోవీ పేరుతో ఔషధం అందుబాటులోకి వచ్చింది. నోవో నోర్డిస్క్ అనే ఔషధ సంస్థ ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఔషధానికి భారీగా డిమాండ్ నెలకొని ఉండటంతో డిమాండ్ కు తగినట్టుగా ఔషధాన్ని సప్లై చేసే విషయంలో సంస్థ ఫెయిల్ అవుతోంది.

     ఔషధం వినియోగం కోసం జూన్ నెలలో అనుమతులు లభించగా తొలిసారి బరువు తగ్గించే ఔషధానికి అనుమతులు లభించాయి. గతంలో ఎన్నో మందులు అందుబాటులోకి వచ్చినా ఆ మందులకు అనుమతులు లభించలేదు. గతంలో అందుబాటులోకి వచ్చిన మందులను వాడినా ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చేవి. ఆ మందుల ఫలితాలు కూడా బాగుండేవి కావు. వీగోవీ ఔషధం ఇంజెక్షన్ రూపంలో తీసుకునే ఔషధం కావడం గమనార్హం.

    ఆకలిని నియంత్రించి బరువు తగ్గించడంలో ఈ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది. ఈ ఔషధం వల్ల దాదాపుగా 15 శాతం బరువు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది. ఔషధానికి నెలకొన్న డిమాండ్ వల్ల సంస్థ ఆదాయం భారీగా పెరిగింది. ఈ ఔషధానికి డిమాండ్ పెరగడానికి కరోనా కూడా ఒక కారణమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఊబకాయంతో బాధ పడేవాళ్ల సంఖ్య మరింత పెరగనుంది.

    ఇలాంటి సమయంలో కొత్త ఔషధాలతో ఊబకాయంకు చెక్ పెట్టడంతో డయాబెటిస్, క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. 2024 సంవత్సరం నాటికి ఈ సంస్థ యొక్క ఆదాయం 3.2 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. అయితే ఈ ఔషధాన్ని వాడటం వల్ల యాసిడ్ రీప్లక్స్, వాంతులు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.