Puneeth Death: పునీత్ మరణానికి కారణం అదే.. డాక్టర్ వాట్సాప్ మెసేజ్ వైరల్

Puneeth Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఉదయం ఎక్సర్ సైజ్ చేస్తుండగా గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. అతడికి కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యాడని వైద్యులు తెలిపారు. పునీత్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు.. యావత్ దక్షిణాది పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. తెలుగు, తమిళ, కన్నడ హీరోలంతా పునీత్ కు నివాళులర్పించారు. గత శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆస్పత్రికి వెళ్లేసరికి పరిస్థితి […]

Written By: NARESH, Updated On : November 6, 2021 9:05 am
Follow us on

Puneeth Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఉదయం ఎక్సర్ సైజ్ చేస్తుండగా గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. అతడికి కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యాడని వైద్యులు తెలిపారు. పునీత్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు.. యావత్ దక్షిణాది పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. తెలుగు, తమిళ, కన్నడ హీరోలంతా పునీత్ కు నివాళులర్పించారు.

puneeth rajkumar

గత శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆస్పత్రికి వెళ్లేసరికి పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు తెలిపారు. చికిత్స అందించిన కాసేపటికే పునీత్ తుదిశ్వాస విడిచాడు. అంత ఫిట్ గా ఉండి.. రోజు ఎక్సర్ సైజ్ చేసి కొవ్వు కరిగించుకునే పునీత్ కు గుండెపోటు ఎలా వచ్చిందని అందరూ ఆరాతీస్తున్నారు.

పునీత్ వయసు కేవలం 46 సంవత్సరాలే. రోజూ వ్యాయామం చేయకుండా ఉండడు. పునీత్ కు వర్కౌట్స్ అంటే చాలా ఇష్టం. అయితే అంత కఠినమైన వ్యాయామం చేయడం వలన ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా పునీత్ కు గత గురువారం రాత్రి గుండెలో కొంచెం నొప్పిగా అనిపించిందని.. ఆ నొప్పితోనే వ్యాయామం చేయడానికి వెళ్లాడని తెలిసింది.

పునీత్ మరణం నేపథ్యంలో ఆయన గురించిన తెలిసిన నారాయణ హెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్ అయిన దేవిశెట్టి నుంచి వచ్చిన ఒక మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మెసేజ్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

‘నేను వైద్యం చేసేవారిలో కొంతమంది సెలబ్రెటీలున్నారు. వారు 40 సంవత్సరాలు పైబడిన వారు. ఫిట్ గా ఉండడానికి ఎక్కువగా ఎక్సర్ సైజ్ చేసేవారు. కానీ వాళ్లు చూడడానికి మాత్రమే ఫిట్ గా ఉండేవారు. ఈ లిస్ట్ లో పునీత్ రాజ్ కుమార్ కూడా చేశారు. జీవితంలో ఏదైనా సరే మితంగా మాత్రమే చేయాలి’ అని డాక్టర్ వాట్సాప్ లో రాసుకొచ్చాడు. 20 నిమిషాలు మాత్రమే ఎక్సర్ సైజ్ చేయండి. అన్ని రకాల ఆహారాలను తీసుకోండి. కీటో డైట్ లాంటివి పాటించకండి.. ఒకవేళ మీకు 40 ఏళ్లు పైబడి ఉంటే.. మీరు పైన చెప్పిన జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పుడే అలవాట్లు మార్చుకోండి.. మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి సమస్య ఎదుర్కోకూడదు. దయచేసి జాగ్రత్త’ అంటూ ఆ డాక్టర్ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. అయితే ఇది పునీత్ డాక్టర్ మెసేజ్ కాదని.. ఎవరో సృష్టించిన ఫేక్ మెసేజ్ అని.. అంటున్నారు. ఇక డాక్టర్ దేవిశెట్టి ఈ వాట్సాప్ మెసేజ్ ను ఖండించారు.