Insomnia: నిద్రలేమితో బాధ పడుతున్నారా.. ఈ ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందట?

Insomnia: ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో నిద్రలేమి సమస్య కూడా ఒకటనే సంగతి తెలిసిందే. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య చాలామందిని వేధిస్తోంది. కొంతమంది వైద్యులను సంప్రదించి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా ఒత్తిడి వల్ల ఎక్కువమందిని ఈ ఆరోగ్య సమస్య వేధిస్తోంది. ఉరుకులపరుగుల జీవితంలో ఎంతోమంది ఒత్తిడితో బాధ పడుతూ అనారోగ్య సమస్యల వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని […]

Written By: Kusuma Aggunna, Updated On : March 29, 2022 9:58 am
Follow us on

Insomnia: ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో నిద్రలేమి సమస్య కూడా ఒకటనే సంగతి తెలిసిందే. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య చాలామందిని వేధిస్తోంది. కొంతమంది వైద్యులను సంప్రదించి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా ఒత్తిడి వల్ల ఎక్కువమందిని ఈ ఆరోగ్య సమస్య వేధిస్తోంది.

Insomnia

ఉరుకులపరుగుల జీవితంలో ఎంతోమంది ఒత్తిడితో బాధ పడుతూ అనారోగ్య సమస్యల వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో కాలుష్యం కూడా నిద్రలేమి సమస్యకు కారణం అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. వాయు కాలుష్యం నిద్రలేమి సమస్యకు పరోక్షంగా కారణమవుతోంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Bangaru Telangana: తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?

నిద్రలేమితో బాధపడే వాళ్లు ప్రధానంగా శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నైట్రోజన్ డయాక్సైడ్‌ ఎక్కువగా పీల్చుకోవడం కూడా నిద్రలేమి సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. వాయు కాలుష్యం ముక్కు పైభాగంతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేసే అవకాశాలు అయితే ఉంటాయి.

కొన్ని సందర్భాల్లో నిద్రలేమికి థైరాయిడ్, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. వైద్యులను సంప్రదించి సరైన సమయంలో సమస్యను గుర్తించడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. నిద్రలేమి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.

Also Read: Jagan Suffered For Gautam Reddy: గౌత‌మ్‌ను త‌ల‌చుకుని బాధ‌ప‌డ్డ జ‌గ‌న్‌.. రాజ‌కీయ హామీ లేన‌ట్టేనా..?