NTR Fans Negative Comments On Rajamouli: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ఎన్టీఆర్ – చరణ్ లు సరికొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. కాకపోతే.. ఇద్దరు హీరో లను బ్యాలెన్స్ చేసే విషయంలో రాజమౌళి కొన్ని చోట్ల తడబడ్డాడు. హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకున్నాడు గానీ, అభిమానుల మధ్య ఘర్షణ తలెత్తకుండా చూసుకోవడంలో జక్కన్న తప్పటడుగు వేశాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం రాజమౌళి పై సీరియస్ గా ఉన్నారు.

ఎన్టీఆర్ ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల సమయాన్ని పెట్టాడు. అందుకే ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫాలోవర్స్ కూడా ఈ సినిమాపై ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, తీరా సినిమా విడుదలైన తరువాత చూస్తే.. ఆశించిన స్థాయిలో ఎన్టీఆర్ ట్రాక్ లేదు. ఈ విషయంలోనే చాలా మంది ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఎన్టీఆర్ పాత్రను కావాలని రాజమౌళి తగ్గించాడు అని విమర్శలు చేస్తున్నారు. హీరోలిద్దరూ చాలా కష్టపడ్డారని.. వారి వారి పాత్రలను అనుసరించి సినిమాలో ఈక్వల్ గా ప్రయారిటీ ఇచ్చామని రాజమౌళి ముందు నుంచి చెబుతూ వచ్చాడు.
Also Read: Junior NTR- TDP: జూనియర్ ఎన్టీఆర్ తోనే టీడీపీకి మనుగడ ఉందా?
సమానంగా పాత్రలు ఇచ్చినా.. తమ హీరో నటన ముందు చరణ్ తేలిపోతాడు కాబట్టి.. ఎన్టీఆర్ మాత్రమే ఈ సినిమాలో హైలైట్ అవుతాడని ఫ్యాన్స్ భావించారు. కానీ.. అలా జరగలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నిరుత్సాహ పడ్డారు. జక్కన్న పై సీరియస్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్న వీడియోలు, మెసేజ్ లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ.. సినిమా అసలు బాలేదని.. మొత్తం రామ్ చరణ్‌కే ప్రాధాన్యం ఇచ్చారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలంగా వాదిస్తున్నారు. రాజమౌళి ఎన్టీఆర్ ని అసలు వాడుకోలేకపోయాడని కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ కి కేవలం పది శాతం మాత్రమే స్కోప్ ఇచ్చారని.. ఇది చాలా దారుణం అని.. అనవసరంగా రాజమౌళి తమ హీరో టైం వేస్ట్ చేశారని మండిపడుతున్నారు.

అయినా రాజమౌళికి ఇలా జరుగుతుంది అని ముందే తెలిసినప్పుడు మా హీరోని కాకుండా.. వేరే ఎవరినైనా చూసుకోవాల్సింది అంటూ జక్కన్న పై విరుచుకుపడ్డారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఇంతకీ రాజమౌళి ఎన్టీర్ ఫ్యాన్స్ కి ఏమి చెబుతాడో చూడాలి.
Also Read: Krithi Shetty In Prabhas Movie: ప్రభాస్ కోసం ‘కృతి శెట్టి’ స్పెషల్ రోల్ ?

[…] Also Read: NTR Fans Negative Comments On Rajamouli: రాజమౌళి పై విరుచుకుపడ… […]
[…] Raj Subramaniam New CEO Of FedEx: అంతర్జాతీయంగా పనిచేస్తున్న ప్రముఖ కంపెనీలకు మన ఇండియన్లు సీఈవోలుగా మారుతూ.. దేశ గౌరవాన్ని పెంచుతున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో వ్యక్తి చేరిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన కొరియర్ డెలివరీ సంస్థ అయిన ఫెడెక్స్‌కు ఇండియన్ అమెరికన్ అయిన సుబ్రమణియం సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. […]
[…] Bigg Boss OTT Telugu Nominations: బిగ్ బాస్ ఓటీటీ అనుకున్నట్టుగానే రంజుగా సాగుతోంది. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, గొడవలతో రచ్చ రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్లు. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోకు.. విపరీతమైన క్రేజ్ వస్తోంది. నాలుగు వారాల్లో వరుసగా ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, ఆర్జే చైతు, సరయులు ఎలిమినేట్ అయిపోయారు. […]