Best 7 CNG Cars: కార్ల వినియోగం పెరుగుతున్న తరుణంలో కొత్త కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల కొన్ని కంపెనీలు మిడిల్ క్లాస్ పీపుల్స్ ను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకు కార్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇదే సమయంలో CNG లపై ఫోకస్ పెడుతున్నాయి. పెట్రోల్ కార్ల కంటే సీఎన్జీ లు మైలేజ్ ఎక్కువగా ఇస్తాయి. అంతేకాకుండా మధ్యతరగతి ప్రజలకు కన్వినెంట్ గా ఉంటుంది. దీంతో వీటికి డిమాండ్ పెరుగుతుంది. ఈ తరుణంలో దేశంలో బెస్ట్ సీఎన్ జీ కార్లు ఏవో తెలుసుకుందామా..
మారుతి సుజుకీ సెలెరియో:
దేశంలోని సీఎన్ జీ కార్లలో అత్యధికంగా మైలేజ్ ఇచ్చే వాటిలో మారుతి సుజుకి సెలెరియో ఒకటి. ఇది 34.33 కి.మీ. /Kg మైలేజ్ ఇస్తుంది. ఇది ఒకే వేరియంట్ లో లభిస్తుంది. దీనిని రూ.6.73 లక్షల ఎక్స్ షోరూం ధరతో విక్రయిస్తున్నారు.
టాటా ఆల్ట్రోజ్ ఐ:
టాటా కంపెనీ నుంచి సీఎన్ జీ మోడల్ బెస్ట్ కారు i-CNG. ఇది కొత్తగా ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో అందుబాటులో ఉంది. ఈ మోడల్ 26 కి.మీ. /Kg మైలేజ్ ఇస్తుంది. ఈ కారు రూ.7.55 లక్షల ఎక్స్ షో రూం ధరతో అమ్ముతున్నారు. ఈ మోడల్ ఇన్నర్ స్పేస్ ఆకట్టుకుంటుంది.
మారుతి సుజుకీ స్విప్ట్:
మారుతి కంపెనీ నుంచి మరో బెస్ట్ సీఎన్ సీ స్విప్ట్. దేశంలో ఈ కారుకు అత్యంత ప్రాధాన్యం కలిగింది. ఈ మోడల్ 30.90 కి.మీ. /Kg సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్విప్ట్ ఎక్స్ షో రూం ధర రూ.7.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
హ్యుందాయ్ ఆరా:
దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన సీఎన్ జీ ఆరా. ఇది సబ్ కాంపాక్ట్ సెడాన్ కూడా. ఈ మోడల్ కిలో ఇంధనానికి 28 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.8.12 లక్షల ఎక్స్ షోరూం ధరతో విక్రయిస్తున్నారు.
మారుతి సుజుకీ ఎర్టీగా:
మారుతి నుంచి మరో సీఎన్ జీ ఎర్టీగా. 7 సీటర్ అయిన ఈ కారు కేజీ ఇంధనానికి 26.11 కిలోమీటరల్ మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.10.88 లక్షలుగా ఉంది.
టాటా టియాగో i-CNG:
టాటా కంపెనీ నుంచి రిలీజ్ అయినా టియాగో i-CNG ట్విన్ సిలిండర్లను కలిగి ఉంది. ఇది కేజీ ఇధనానికి 27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.6.54 లక్షలతో విక్రయిస్తున్నారు.
మారుతి సుజుకి బ్రెజ్జా:
మారుతి నుంచి బ్రెజ్జా కూడా సీఎన్ జీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. సీఎన్ జీతో ఉన్న బెస్ట్ కంపాక్ట్ కారు ఇది. కేజీ ఇంధనానికి 25.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.24 ఎక్స్ షోరూం ధరలో విక్రయిస్తున్నారు.