https://oktelugu.com/

గుడ్డులోని పచ్చసొన తినడం వల్ల కలిగే లాభాలు తెలుసా…?

మనలో చాలామంది గుడ్డును ఎంతో ఇష్టంగా తింటారు. సంపూర్ణ పోషకాహారంగా పిలవబడే గుడ్డును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే కొంతమంది గుడ్డులోని పచ్చసొనను తినడానికి పెద్దగా ఇష్టపడరు. పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు భారీగా పెరుగుతుందని చాలామంది భావిస్తారు. సాధారణంగా 50 గ్రాముల బరువు ఉండే గుడ్డులో కేవలం 5 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది. Also Read: పసుపు పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..? అయితే శాస్త్రవేత్తలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 28, 2020 / 11:59 AM IST
    Follow us on


    మనలో చాలామంది గుడ్డును ఎంతో ఇష్టంగా తింటారు. సంపూర్ణ పోషకాహారంగా పిలవబడే గుడ్డును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే కొంతమంది గుడ్డులోని పచ్చసొనను తినడానికి పెద్దగా ఇష్టపడరు. పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు భారీగా పెరుగుతుందని చాలామంది భావిస్తారు. సాధారణంగా 50 గ్రాముల బరువు ఉండే గుడ్డులో కేవలం 5 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది.

    Also Read: పసుపు పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..?

    అయితే శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల్లో గుడ్డును ప్రతిరోజూ తీసుకున్నా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవని తేలింది. కేలరీలు కూడా పచ్చసొనలో తక్కువగా ఉంటాయి కాబట్టి పచ్చసొన తినడం వల్ల బరువు పెరగడం అపోహేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐరన్ పుష్కలంగా ఉండే పచ్చసొనను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి వైద్యులు సైతం పచ్చసొనను తినాలని సూచిస్తున్నారు.

    Also Read: శీతాకాలంలో జుట్టు విషయంలో చేయకూడని తప్పులివే..?

    గుడ్ల ద్వారా శరీరానికి మంచి కొలెస్ట్రాల్ లభిస్తుందని.. గుడ్లు గుండె పనితీరును మెరుగుపరచటంతో పాటు రక్తపోటును నియంత్రిస్తాయని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన ఎ, డి, ఇ, కె విటమిన్లు పచ్చసొనలో ఉంటాయి. పచ్చసొన మెదడు పెరుగుదలకు సహాయపడుతుంది. రోజూ గుడ్లను తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.

    మరిన్ని వార్తల కోసం ఆరోగ్యం/జీవనం

    పచ్చసోన ద్వారా శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. పచ్చసొన ద్వారా లభించే పోషకాలు శరీరంలో జీవక్రియలు సరైన విధంగా జరిగేందుకు సహాయపడతాయి. ఎక్కువగా శ్రమ చేసేవారు. రోజుకు రెండు గుడ్లు, శ్రమ చేయని వారు రోజుకు నాలుగు గుడ్లు తీసుకుంటే మంచిది.