అన్ని పార్టీలూ దాదాపుగా ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతుంటాయి. ఆ రోజున ఆ పార్టీ అధినేతలు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవడం.. లేదంటే ఏదైనా వరాలు ప్రకటించడం చూస్తుంటాం. మరికొందరు తమ పార్టీ కష్టాలను చెప్పుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆయా పార్టీలు ఖచ్చితంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తుంటాయి. అంటే.. ఇంకా తమ పార్టీ బతికే ఉందని ప్రజలకు మెస్సేజ్ వెళ్లేలా చేస్తుంటారు. ఏది ఏమైనా పార్టీల బర్త్‌డే వేడుకలు మాత్రం కామన్.
మరి ఇప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ చేయాల్సింది ఏమిటి..? నేడు ఆ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం. మరికొద్ది రోజుల్లో రాహుల్‌కు మళ్లీ పార్టీ పట్టం కట్టబోతున్నారు.అలాంటి సందర్భంలో స్థానకంగా ఉండి.. ఆవిర్భావ దినోత్సవాన్ని అడ్వాన్‌టేజీగా తీసుకోవాల్సింది పోయి ఇప్పుడు రాహుల్ ఎక్కడున్నట్లు..?
Also Read: రెండో టెస్టుపై పట్టుబిగించిన..131 పరుగుల ఆధిక్యం
ఇప్పటికే.. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. దేశానికి ప్రభుత్వం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ స్థాయి బలం పుంజుకోవడం లేదు. అలాంటి ఉద్దేశమే ఆ పార్టీకి లేనట్లుగా అనిపిస్తోంది. ఈ క్రమంలో దాని ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. మరి ఇలాంటి సందర్భంలో ఆ పార్టీ ఆశాకిరణం రాహుల్ గాంధీ యూరప్ వెళ్లారు. ఇటలీ వెళ్లారట, అందులోనూ మిలన్ వెళ్లారట. ఇది ఆయన వ్యక్తిగత పర్యటనే అని కాంగ్రెస్ ప్రకటించింది.
Also Read: బ్రేకింగ్: రజినీకాంత్ గురించి కీలక అప్ డేట్
కానీ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని దేశ వ్యాప్తంగా తమ శ్రేణుల్లో స్ఫూర్తి నింపాల్సిన ఈ నేత ఇటలీలో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లాడట. ఒకవైపు సోనియాగాంధీ అనారోగ్యంతో ఇంటికి పరిమితం అయ్యారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆమె జనం మధ్యకు వచ్చే పరిస్థితి లేదు. ఆమె ఆవిర్భావ దినోత్సవానికి హాజరు కావడం లేదని స్పష్టం. ఇలాంటి సమయంలో తన బాధ్యతను వదిలి రాహుల్ మరోసారి పర్సనల్ టూర్‌కు చెక్కేశారు. అందుకే ఇప్పుడు సొంత పార్టీలోనే ఓ విమర్శ వినిపిస్తోంది. రాహుల్‌ను నమ్ముకుంటే.. కుక్క తోకను పట్టుకొని గోదారి ఈదినట్లే అవుతుందని. అవును కదా మరి.. కొద్ది రోజుల్లో పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టబోతున్న ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందుబాటులో లేకుండా అమ్మమ్మ వాళ్ల ఇంటికి పోవడం ఏంటనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్