Camphor: సాధారణంగా కర్పూరాన్ని ఎక్కువగా మనం పూజా సమయాలలో మాత్రమే ఉపయోగిస్తాము. ప్రతి రోజు పూజ ముగిసిన తర్వాత దేవుడికి కర్పూర హారతి ఇచ్చి ఆ హారతిని మన కళ్లకు అద్దుకుంటాము.ఇలా కర్పూరహారతి తీసుకోవటంవల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా మన ఇంటిలో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. అందుకోసమే ప్రతి రోజు పూజ అనంతరం కర్పూర హారతి ఇస్తుంటారు. కర్పూరం కేవలం పూజ లో మాత్రమే కాకుండా ఇందులో ఉన్నటువంటి ఎన్నో ఔషధ గుణాలు మనకు మంచి ఆరోగ్యాన్ని అందించడంలో దోహదపడుతుంది.
కర్పూరంలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల దగ్గు జలుబు వంటి సమస్యల నుండి తొందరగా ఉపశమనం కల్పిస్తుంది.ముఖ్యంగా దగ్గు జలుబు సమస్యతో బాధపడేవారు కర్పూరాన్ని వేడి నీటిలో వేసుకుని ఆవిరి పట్టడం వల్ల తొందరగా దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.అలాగే కండరాల నొప్పులతో బాధపడేవారు ఆవ నూనెలో కొద్దిగా కర్పూరం వేసి ఆ నూనెతో ప్రతి రోజూ మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
ఇక చర్మంపై మచ్చలు ఉన్నవారు కొబ్బరినూనెలో కర్పూరం వేసి ప్రతిరోజు కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మం పై ఉన్న మచ్చలు తొలగిపోయి ఎంతో అందంగా కనిపిస్తారు. కానీ కొందరి శరీర తత్వాన్ని బట్టి ఇలా చేయడం వల్ల రియాక్షన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఒకసారి వైద్యున్ని సంప్రదించి వాడటం ఎంతో ఉత్తమం.ఇక అధిక ఒత్తిడి సమస్యతో బాధపడేవారు మీ పడక గదిలో ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో ఒక కర్పూరం వేసి ఉంచడం వల్ల మీకు ఒత్తిడి తగ్గిపోతుంది.