https://oktelugu.com/

Rajanikanth: రజనీకాంత్​ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Rajanikanth: తమిళ సూపర్​స్టార్​గా పిలిచే రజనీకాంత్​కు ఒక్క తమళ్​లోనే కాదు. .యావత్​ దేశంలో కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్​ హిట్​గా నిలిచి.. రికార్డుల వర్షం కురిపించాయి. నేటి స్టార్​ యువ హీరోలకు ధీటుగా పోటీ ఇస్తూ ఇప్పటికీ కొత్తదనం ఉన్న కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు ఆయన. ఇటీవలే తలైవా హీరోగా వచ్చిన అన్నాత్తై సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాల ద్వారా ఆయన బాగానే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 12, 2021 / 10:40 AM IST
    Follow us on

    Rajanikanth: తమిళ సూపర్​స్టార్​గా పిలిచే రజనీకాంత్​కు ఒక్క తమళ్​లోనే కాదు. .యావత్​ దేశంలో కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్​ హిట్​గా నిలిచి.. రికార్డుల వర్షం కురిపించాయి. నేటి స్టార్​ యువ హీరోలకు ధీటుగా పోటీ ఇస్తూ ఇప్పటికీ కొత్తదనం ఉన్న కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు ఆయన. ఇటీవలే తలైవా హీరోగా వచ్చిన అన్నాత్తై సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాల ద్వారా ఆయన బాగానే సంపాదించారు. ప్రస్తుతం సినిమా ద్వారా అత్యధిక సంపాదన కలిగిన నటుల జాబితాలో రజనీ కూాడా చేరిపోయారు. కొట్లల్లో రెమ్యునరేషన్​ తీసుకుంటున్న రజనీకి ఎన్నో ఆస్తులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒకానొక ఇంటర్వ్యూలో తన నికర విలువ చెప్పేశారు.

    తాజా నివేదిక ప్రకారం రజనీకాంత్ నికర విలువ 365 కోట్లు అని అంచనా. రజనీ తనకున్న దాంట్లో చాలా వరకు దానంగా ఖర్చు చేస్తుంటారు. ఇది మాత్రమే కాదు ఏదైనా సినిమా ఫ్లాప్​ అయితే ఆ సినిమా రెమ్యునరేషన్​ నిర్మాతకే తిరిగి ఇచ్చేస్తాడని అందరూ అంటారు. ఒక్కో సినిమాకు సుమారు రూ.50 కోట్లు తీసుకుంటారని టాక్​. ప్రస్తుతం రజనీకి విలాసవంతమైన భవనం ఉంది. అందులో తనకెంతో ఇష్టమైన పురాతన వస్తువులతో ఇంటిని అలకరిస్తుంటారు.

    కాగా, ఇటీవలే చిత్రసీమకు ఆయన చేసిన కృషికి గాను దాదాసాహెబ్ ఫాల్కె అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు స్వీకరించిన సందర్భంగా.. రజనీకాంత్​ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనేన తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.