https://oktelugu.com/

soaking raisins : ఎండుద్రాక్ష ను నేరుగా కాకుండా నానబెట్టి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? ముఖ్యంగా మహిళలకు..

ఆరోగ్యంగా ఉండటానికి డ్రై ఫ్రూట్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే రెగ్యులర్ గా డైట్ లో వాటిని భాగం చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. కానీ చాలా డ్రై ఫ్రూట్స్ ను డ్రై గా కాకుండా నానబెట్టి తీసుకోవాలి అంటారు కదా. ఇలా చాలా మంది తింటారు కూడా. ముఖ్యంగా బాదాన్ని కూడా ఇలాగే తినడం అలవాటు. వాస్తవానికి ఈ డ్రై ఫ్రూట్స్ ను నార్మల్ గా కాకుండా.. నానబెట్టి తీసుకోవాలి. ఇక వీటిలో బాదం పప్పు, అంజీరా వంటివి ఎన్ని ప్రయోజనాలను అందిస్తాయో..ఎండు ద్రాక్ష కూడా అదే రేంజ్ లో ప్రయోజనాలను అందిస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 9, 2024 / 12:19 PM IST

    Do you know how many benefits of soaking raisins instead of eating them directly? Especially for women.

    Follow us on

    soaking raisins :  ఎండు ద్రాక్షను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. నానిన ఆ కిస్మిస్ లను కూడా తినాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళలకు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయట. మరి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

    ఐదు నుంచి పది వరకు ఎండు ద్రాక్ష తీసుకొని వాటిని రాత్రిపూట నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అంతే కాదు గుండె పనితీరు కూడా మెరుగు అవుతుంది. ఆరోగ్యంగా కూడా పదిలంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

    ప్రస్తుతం చాలా మంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. ముఖ్యంగా జంక్ ఫుడ్ లను తింటున్నారు. దీనివల్ల మలబద్దకం సమస్య వేధిస్తోంది. అలాంటివారు ఈ నానపెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల మలబద్ధకం నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు. 20 ఎండు ద్రాక్షలను తీసుకొని నీటిలో నానపెట్టాలి. లేదంటే వాటిని మరిగించాలి. వీటిలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

    ప్రతిరోజూ సాయంత్రం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. లేదంటే.. నీటిలో నానబెట్టి ఉదయం పూట తీసుకోవడం కూడా మంచిదే. ఇలా చేయడం వల్ల.. రక్తహీనత నుంచి తప్పించుకోవచ్చు. రక్తం తక్కువగా ఉన్నవారు ఇలా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    ఎండు ద్రాక్షను రెగ్యులర్ గా నానబెట్టి తినాలి. కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. యూరిన్ సంబంధిత సమస్యలు కూడా మాయం అవుతాయి. యూరిన్ సంబంధిత సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది ఈ నానబెట్టిన ఎండు ద్రాక్ష. అంతేకాదు… రెగ్యులర్ గా ఈ ఎండు ద్రాక్షను నానబెట్టి తినడం వల్ల నీరసం కూడా ఉండదు. ఫుల్ యాక్టివ్ అవుతారు. అంటే రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు అంటున్నారు నిపుణులు.