https://oktelugu.com/

Donkey milk : ఆపు పాలు పచ్చిగా తాగవచ్చా? పిల్లలకు గాడిద పాలు ఇవ్వవచ్చా?

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పాలు, గుడ్లు తీసుకోవాలి. పాలు, గుడ్లు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను ఇస్తాయి. పాలు, గుడ్లు శరీరానికి కాల్షియం అందించి ఎముకలను దృఢపరుస్తాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు గుడ్లు ఇవ్వకపోయినా సరే పాలను మాత్రం కచ్చితంగా ఇస్తారు. పాలలో కాల్షియం ఉంటుంది. ఇది మన ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధారణంగా పాలు వేడిగా తాగడం మంచిది అయితే, చాలా మంది పాలను పచ్చిగా తాగుతారు. పచ్చి పాలు మరింత ఆరోగ్యకరమైనవి అనుకుంటారు. అయితే వేడి చేయకుండా తాగే పాల వల్ల ప్రయోజనం కంటే హానికరమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఆవులు, గేదెలు లేదా మేకల నుంచి వచ్చే పచ్చి పాలలో హానికరమైన జెర్మ్స్ లేదా బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కలిగిస్తాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 9, 2024 12:35 pm
    Can you drink raw milk? Can donkey milk be given to children?

    Can you drink raw milk? Can donkey milk be given to children?

    Follow us on

    Donkey milk : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆవు లేదా గేదె పాలను వాడుతుంటారు. అయితే ఈ పాలను పచ్చిగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. పచ్చి పాలలో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఉంటాయి. పచ్చి ఆవు పాలు తాగడం వల్ల కీళ్లనొప్పులు, విరేచనాలు లేదా డీహైడ్రేషన్ వంటి సమస్యల వస్తాయి. పచ్చి పాలు గర్భానికి కూడా మంచిది కావు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో లిస్టెరియా మోనోసైటోజెనెస్ బాక్టీరియా ఉంటుంది. లిస్టెరియోసిస్ అనే ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతాయి. గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులకు ప్రమాదం కూడా. పచ్చి పాల వల్ల గర్భస్రావం, అకాల ప్రసవానికి లేదా బిడ్డ, తల్లి ప్రాణానికి ప్రమాదం కావచ్చు.

    ఇది బర్డ్ ఫ్లూని కలిగిస్తుంది. వంట చేయడానికి లేదా పాశ్చరైజేషన్ చేయడానికి పచ్చి పాలను తీసుకుంటే శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కడుపు వ్యాధులు లేదా సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. పచ్చి పాలు తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అయితే కొందరు ఏకంగా గాడిద పాలు తాగుతారు. దీని వల్ల చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గాడిద పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆవు, గేదె, మేక, ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాలలో.. తల్లి పాలలో ఉండే పోషకాలు ఉంటాయి అంటున్నారు పరిశోధకులు. గాడిద పాలలో ఆవు పాలతో సమానమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందుకే వీటిని శిశువులకు పట్టించడం మంచిది. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలను సైతం గాడిద పాలు దూరం చేస్తాయట.

    దగ్గు, దమ్ము వంటి సమస్యలతో బాధపడే చిన్నారులకు గాడిద పాలు మంచి రెమెడీ. ఇన్ఫెక్షన్లూ, కోరింత దగ్గు, ఆర్థరైటిస్, వైరల్‌ జ్వరాలు, ఆస్తమా, గాయాలు నయం చేసేందుకు గాడిదపాలను మందుగా వాడుతారు. గాడిద పాలలో యాంటీ మైక్రోబయాల్‌ లక్షణాలు ఉంటాయి. అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్‌ల బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి గాడిద పాలు. అంతేకాదు నిద్రలేమి, ఎసిడిటీతోపాటు ఎగ్జిమా, సిఫిలిస్‌, స్కాబిస్‌, దురద, తామర వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గాడిద పాలలో ఉండే లాక్టోస్ ఎముకలను బలంగా మారుస్తుంది.