
Spring Onion Benefits: మన ఆరోగ్య సంరక్షణకు మన ప్రకృతి ఎన్నో ప్రసాదించింది. అందులో పలు రకాల మొక్కలు, ఆకులు ఉన్నాయి. మనం ఉల్లిని ఆహారంలో భాగంగా చేసుకుంటాం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటుంటారు. అందులో ఉల్లి కాడలను కూడా మనం కూరలో వేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. దీంతో మనకు పోషకాలు కూడా మెండుగా అందుతాయి. ఉల్లికాడలతో కూర చేసుకుంటే ప్రొటీన్లు ఎక్కువగానే అందుతాయి. చలికాలంలో ఉల్లికాడలను తింటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇందులో జింక్, భాస్వరం, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుతాయి.
Also Read: Blood Sugar Levels: రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గడానికి ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?
ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో..
ఉల్లికాడలు రోగాలు రాకుండా చూస్తాయి. మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. సూప్ లు, గ్రేవీలు, ఇతర వంటకాల్లో ఉల్లికాడలను వాడటం సహజమే. ఉల్లికాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లికాడల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ కె, ధయామిన్ లు ఎక్కువగా ఉండటంతో లాభాలు అనేకం ఉన్నాయి. ఇందులో ఉండే మెగ్నిషియం, రాగి, జింక్, భాస్వరం, ఫైబర్ లతో ఉల్లికాడలు ప్లేవనాయిడ్స్ మనకు ప్రయోజనాలు కలిగిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
క్యాన్సర్ కారకాలను..
ఉల్లికాడలు క్యాన్సర్ కారకాలను దూరం చేసే వాటికి సహకరిస్తాయి. ఇంకా అనేక రకాల ఇబ్బందులు కలిగించే ఫంగల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి దూరం చేస్తాయి. ఉల్లికాడలు కెరోటినాయిడ్లు, విటమిన్ ఎ కు ప్రధాన వనరుగా ఉంటుంది. కంటి జబ్బులను దూరం చేస్తాయి. చూపు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి సమస్యలకు చెక్ పెడతాయి. విటమిన్ ఎ, విటమిన్ సి ఉండటంతో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది.

షుగర్ ను కంట్రోల్ లో..
రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. దీంతో మన శరీరం ఇబ్బందులు కలగకుండా నిరోధించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉల్లికాడలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యలు లేకండా పోతాయి. మనకు ఆకలిని పెంచేలా చేస్తాయి. డయేరియా వంటి రోగాల నుంచి బయట పడేస్తాయి. ఉల్లికాడల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇలు ఉండటంతో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందిస్తాయి.
Also Read: CM KCR : నిండు సభలో కేసీఆర్ పిట్టకథ.. నవ్వలేక చచ్చిన ఎమ్మెల్యేలు