
Blood Sugar Levels: గ్లైస్ మిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెరను అదుపులో లేకుండా చేస్తాయి. మధుమేహులకు గ్లైస్ మిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గ్లైస్ మిక్ ఇండెక్స్ అంటే ఆహారాలలో ఉండే కార్బోహైడ్రేడ్ల కొలత అని అర్థం. మనం తినే ఆహారాల్లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు. ఇంకా ఎక్కువ బాధపడతారు. తక్కువ గ్లైస్ మిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.
Also Read: CM KCR : నిండు సభలో కేసీఆర్ పిట్టకథ.. నవ్వలేక చచ్చిన ఎమ్మెల్యేలు
గ్లైస్ మిక్ ఇండెక్స్ తక్కువగా..
గ్లైస్ మిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా గ్లైస్ మిక్ తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. గ్లైస్ మిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే బరువు పెరిగేందుకు కారణమవుతాయి. గ్లైస్ మిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటేనే ప్రయోజనం. ఒక అధ్యయనం ప్రకారం తక్కువ గ్లైస్ మిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించాలి.
నారింజ
పండ్లలో నారింజకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో గ్లైస్ మిక్ ఇండెక్స్ తక్కువగా ఉందని చెబుతున్నారు. డయాబెటిస్ రోగులకు ఈ పండు ఎంతో మంచిది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీంతో ఇది ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైనదిగా భావిస్తుంటారు. ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా గ్లైస్ మిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయని తేలింది. మధుమేహులు దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఓట్ మీల్ లో కూడా తక్కువ గ్లైస్ మిక్ ఇండెక్స్ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచే వంటకంగా మారుతుంది. ఇంకా బ్రౌన్ రైస్ కూడా షుగర్ పేషెంట్లకు ఉత్తమం. వైట్ రైస్ లో కార్బోహైడ్రేడ్లు అధికాంగా ఉంటాయి. అందుకే బ్రౌన్ రైస్ ను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ మనకు ఎన్నో విధాలుగా రక్షణ నిస్తుంది. పోషకాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. మన ఆరోగ్య రక్షణలో బ్రౌన్ రైస్ ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు.

మజ్జిగ
మజ్జిగ కూడా గ్లైస్ మిక్ ఇండెక్స్ తక్కువగా కలిగి ఉంటుంది. మధుమేహులు దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో ప్రొటీన్ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుకే గ్లైస్ మిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం మనం జాగ్రత్తలు తీసుకుంటే సరి.
Also Read:Ananya Nagella’s Instagram photos : జాకెట్ వేసుకోకుండా మొత్తం విప్పి చూపించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్