Rose Flowers: గులాబీ పువ్వులను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

ప్రతి రోజూ ఓ నాలుగు రేకుల గులాబీలను తినాలి అంటున్నారు నిపుణులు. ఇలా తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయట. చాలా మంది ఈ మధ్య కాలంలో ఒత్తిడికి, ఆందోళనకు కామన్ గా గురి అవుతున్నారు.

Written By: Swathi Chilukuri, Updated On : September 4, 2024 5:51 pm

Rose Flowers

Follow us on

Rose Flowers: అందమైన పువ్వు అనగానే ముందుగా గుర్తు వచ్చేది గులాబీ. ఈ పువ్వు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అందమైన గులాబీ చుట్టు కవితలు కూడా చాలా ఉన్నాయి. దీని అందాన్ని వర్ణించడానికి కవులు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఇక ఈ మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుతుంటారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. తెల్ల గులాబీలు, ఎరుపు, పింక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రంగులు, రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గులాబీలను పూజలు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు జడలో పెట్టుకుంటే ఆ జడకే అందం వస్తుంది. ఇక వీటిని సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. కానీ గులాబీ రేకులను తినడం చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటంటే..

ప్రతి రోజూ ఓ నాలుగు రేకుల గులాబీలను తినాలి అంటున్నారు నిపుణులు. ఇలా తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయట. చాలా మంది ఈ మధ్య కాలంలో ఒత్తిడికి, ఆందోళనకు కామన్ గా గురి అవుతున్నారు. కానీ గులాబీ రేకులు తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు అంటున్నారు నిపుణులు. అంతేకాదు మానసిక ప్రశాంతత పొందవచ్చట.

గులాబీ రేకులను తినడం వల్ల నిద్ర సమస్యల నుంచి కూడా రిలీఫ్ పొందవచ్చట. అయితే సాధారణంగా ఒత్తిడిగా ఉన్నప్పుడు చాలా మందికి నిద్ర అనేది రాదు. ఇలా నిద్ర లేమి సమస్యలతో బాధ పడేవారు గులాబీ పూల వాసన పీల్చితే సరిపోతుందట. అంతేకాదు గులాబీలను నమలినా సరే మనసు ప్రశాంతంగా మారుతుందట. తద్వారా మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.

బరువు తగ్గడంలో కూడా గులాబీ రేకులు మీకు సహాయం చేస్తాయి. గులాబీ రేకులు నమలడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలు, చెడు కొలెస్ట్రాల్ కు చెక పెట్టవచ్చు. ఇక జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా సవ్యంగా ఉంటుంది. తద్వారా వెయిట్ లాస్ అవడానికి సహాయం చేస్తాయి. ప్రతి రోజూ గులాబీ రేకులు నమలడం వల్ల చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటివల్ల యవ్వనంగా తయారవుతారు అంటున్నారు నిపుణులు. చర్మంపై ఉండే డల్ నెస్ దూరం అవుతుందట. చర్మం హైడ్రేటై.. మొటిమలు, పొడిబారడం దూరం అవుతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఈ గులాబీ రేకలు. అంతేకాదు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలు వీటిలో ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బరి నూనెలో గులాబీ రేకులను కలిపి వేడి చేసుకోవాలి. చల్లరిన తరువాత తలకు రాసుకోవడం వల్ల మెదడు చల్లబడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

రక్తపోటును తగ్గించడంలో సహాయం చేస్తాయి. గులాబీ రేకులు, బాదంపప్పు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా చేస్తే రక్తపోటు తగ్గుతుంది. అంతేకాదు శరీరంలోని చెడు కొవ్వులను తగ్గిస్తాయి గులాబీ పువ్వులు. గులాబీ రేకులతో తయారైన కషాయాన్ని తీసుకోవటం వల్ల శరీరంలోని చెడు కొవ్వు కూడా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. చీముపట్టి బాధపడుతుంటే పుళ్ళ మీద గులాబీ పొడి చల్లాలి. ఇలా చేస్తే గులాబీ పొడి యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది. అంతేకాదు వాటిని తొందరగా తగ్గేలా చేస్తాయి గులాబీలు.