https://oktelugu.com/

Bad Breath: నోరు కంపు కొడుతుందా? నలుగురిలో మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉందా? అయితే ఇదిగో పరిష్కారం..

సరిగ్గా బ్రష్ చేయకపోతే మాత్రం కచ్చితంగా నాలుక, దంతాల మీద ఆహార కణాలు, బ్యాక్టీరియా పేరుకుపోయి పెరిగిపోతుంది. దీనివల్ల కుళ్ళిపోతున్న ఆహారాన్ని బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేయడం మొదలు పెడుతుంది తద్వారా దుర్వాసన వస్తుంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 5, 2024 / 05:21 AM IST

    Bad Breath

    Follow us on

    Bad Breath: మాట్లాడుతున్నప్పుడు నోట్లో నుంచి స్మెల్ వస్తే మనకు, పక్కన ఉన్నవారికి ఇద్దరికి కూడా ఇబ్బందే కదా. దీని వల్ల చాలా ఇన్‌సెక్యూరిటీ ఫీల్ వస్తుంటుంది. ఈ సమస్యకి ప్రధాన కారణం బ్యాక్టీరియా, నోరు శుభ్రంగా లేకపోవడమే అంటారు నిపుణులు. కాబట్టి, నోటిని క్లీన్ చేసుకోవడం మాత్రం చాలా ముఖ్యంగా పరిగణిస్తారు. అయితే, ఈ సమస్యని ఎలా తగ్గించుకోవాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

    సరిగ్గా బ్రష్ చేయకపోతే మాత్రం కచ్చితంగా నాలుక, దంతాల మీద ఆహార కణాలు, బ్యాక్టీరియా పేరుకుపోయి పెరిగిపోతుంది. దీనివల్ల కుళ్ళిపోతున్న ఆహారాన్ని బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేయడం మొదలు పెడుతుంది తద్వారా దుర్వాసన వస్తుంటుంది. కొన్ని సహజ టూత్‌పేస్టులలో లాలాజలాన్ని ప్రేరేపించే పదార్థాలు ఉంటాయి. ఇవి సహజంగా నోటిని తాజాగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి. ఫోమింగ్ ఏజెంట్ SLS నోరు పొడిబారడానికి, నోటి దుర్వాసనకు కారణమవుతుంది అంటున్నారు నిపుణులు.

    అయితే సహజ నూనె ఉన్న టూత్‌పేస్ట్‌ని వాడటం వల్ల నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకి రెండు సార్లు రెండు నిమిషాల పాటు పళ్ళు తోముకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు దంత వైద్యులు. నాలుక తో సహా దంతాలను కూడా క్లీన్ చేసుకోవాలి. నోటిలోని ఆహార కణాలను బయటకి పంపడానికి పుక్కిలించి ప్రతి రోజు నోరు శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల బ్యాక్టీరియా తగ్గి నోటి దుర్వాసన నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. నోటి దుర్వాసనని దూరం చేయడానికి మంచి ఆహారం తీసుకోవడం కూడా ప్రధానమే.

    విటమిన్స్, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి. ఇలా చేస్తే నోటిలో లాలాజలాన్ని కూడా పెంచవచ్చు. ఇది ఆహార కణాలను, బ్యాక్టీరియాని తొలగించడంలో సహాయం చేస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎక్కువగా తింటే నోటి దుర్వాసన పెరుగుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్స్, యాసిడ్ రిఫ్లక్స్, మధుమేహం కూడా నోటి దుర్వాసనకి కారణం అవుతాయి అంటున్నారు నిపుణులు. అయితే దీనికి ట్రీట్‌మెంట్ అవసరమట. ఈ సమస్యని దూరం చేసుకోవడానికి సహజ మార్గాలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.

    ఆహారకణాలు, చనిపోయిన కణజాలాల కారణంగా నోటి దుర్వాసన ఎక్కువ వస్తుంటుంది. వీటిని తొలగించాలంటే నోటిలో లాలాజలం ఉత్పత్తి అవసరం అవుతుంది. ఏవైనా మందులు, డీహైడ్రేషన్, ఆరోగ్య సమస్య కారణంగా నోరు పొడిగా మారి బ్యాక్టీరియా పేరుకుపోయి నోటి దుర్వాసనకి కారణం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్త. రోజులో తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోండి. నీరు తాగడం వల్ల సహజంగా నోటిని క్లీన్ చేస్తుకోవచ్చు. నీరు బ్యాక్టీరియాని తొలగిస్తుంది. రోజంతా నీటిని తాగడం వల్ల నోరు హైడ్రేట్‌గా మారుతుంది. తద్వారా బ్యాక్టీరియా ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా చేసి.. నోటి దుర్వాసనని తగ్గించడంలో సహాయం చేస్తుంది. మరీ ముఖ్యంగా నోటి దుర్వాసన రాకుండా ఉండటానికి రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అవసరం. డెంటిస్ట్ మిమ్మల్ని చెక్ చేసి ట్రీట్‌మెంట్ చేయడం వల్ల నోటి దుర్వాసన దూరం అవుతుంది.