Spicy Food: భారతదేశంలో రుచికరమైన ఆహారం కోసం చాలామంది ఆరాటపడతారు. ఈ క్రమంలో స్పైసీ ఫుడ్ మరీ ఇష్టంగా తింటారు. కొంతమంది రెగ్యులర్ గా స్పైసి ఫుడ్ లేనిది ముద్ద దిగదని భావిస్తారు. ముఖ్యంగా భోజన సమయంలో కూరలు స్పైసీగా ఉండాలని కోరుకుంటారు. నాలికకు రుచి ఉండాలని భావించి చాలామంది కారం ఎక్కువగా ఉండేలా చూస్తారు. అయితే కారం ఎక్కువగా వేసుకోవడం వల్ల కూరలు రుచిగా అనిపిస్తాయి. కానీ అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందా..
నేటి కాలంలో ఇంట్లోనే కాకుండా హోటళ్ళలోనూ స్పైసీ ఫుడ్ ను అందుబాటులో ఉంచుతున్నారు. టేస్టీ కోసం ఇందులో రకరకాల పదార్థాలతో పాటు కారంను కూడా అధికంగా వేస్తున్నారు. ఎర్రటి కారం తో పాటు కాస్త ఘాటు కోసం పచ్చి మిర్చిని యాడ్ చేస్తున్నాను. అయితే ఇలా మిక్స్డ్ కారం తినడం వల్ల శరీరం లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. దానితో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
స్పైసి ఫుడ్ తీసుకునేవాళ్లల్లో ప్రధానంగా అజీర్తి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరు సాధారణ సమయంలో మామూలు ఆహారం తీసుకున్నా డైజెస్ట్ కాదు. అంతకుముందు వీరు స్పైసి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రేగుల్లో అనేక సమస్యలు ప్రారంభమై ఆ తరువాత అజీర్తి సమస్యలు ఎదుర్కుంటారు.
స్పైసి ఫుడ్ ఎక్కువగా తినే వారిలో మరో సమస్య బిపి ఎక్కువగా ఉండడం. ఈరోజుల్లో ప్రతి ఒక్కరిలో బీపీ సమస్యలు ఉంటున్నాయి. అందుకు కారణం స్పైసీ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇక స్పైసీ ఫుడ్ మానసిక సమస్యలకూ దారి తీస్తుంది. ఎక్కువగా కారం తినేవాళ్ళు చికాకుతో కనిపిస్తారు.
కారం ఎక్కువ తినేవారు బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఎర్రకారంతోపాటు పచ్చి మిర్చి తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక కొవ్వు పేరుకు పోతుంది.క్యాలరీలు కరగకుండా కారం అడ్డుకుంటుంది.
స్పైసి ఫుడ్ తీసుకునేవారు ఫైల్స్ సమస్యతోను బాధపడతారు. ఎక్కువగా పచ్చిమిర్చి తినేవారిలో ఈ సమస్యలు ఉంటాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.