Homeజాతీయ వార్తలుYS Sharmila: పాపం షర్మిళ.. ఇలా బుక్కయ్యారేంటి?

YS Sharmila: పాపం షర్మిళ.. ఇలా బుక్కయ్యారేంటి?

YS Sharmila: తెలంగాణలో వైయస్ షర్మిళ దాదాపు ఒంటరి అయ్యారు. ఆమె పార్టీ వైపు ఒక్కరంటే ఒక్కరు కూడా చూడడం లేదు. కాంగ్రెస్, బిజెపిలో దక్కని వారు తమ పార్టీ వైపు వస్తారని ఆమె ఎంతో ఎదురు చూశారు. అయితే సైలెంట్ గా ఉంటాం కానీ.. ఆమె పార్టీ వైపు వెళ్ళమని అసంతృప్తులు తేల్చేస్తుండడంతో.. ఆమెకు ఎదురుచూపులు తప్పడం లేదు. కనీసం కోదండరాంతో చర్చలు జరిపి తమ వైపు తిప్పుకున్న కాంగ్రెస్ పార్టీ.. షర్మిల విషయంలో మాత్రం.. ఎందుకో వెనుకడుగు వేస్తోంది. ఎన్నికలు సుదూరంగా ఉన్న సమయంలో అన్ని పార్టీలు ఆమె వైపు చూసినట్లు వార్తలు వచ్చాయి. తీరా ఎన్నికల సమయంలో మాత్రం ముఖం చాటేశాయి.

కెసిఆర్ సర్కార్ షర్మిళ ను ఇబ్బంది పెట్టినప్పుడు సాక్షాత్ ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె పార్టీకి ఏనుగంత బలం వచ్చింది. ప్రధాని మోదీ నేరుగా ఫోన్ చేసి సంఘీభావం తెలిపారంటే..ఆమె శక్తి, చరిష్మా పెరిగిందని అందరూ అంచనా వేశారు. తీరా ఎన్నికలు సమీపించేసరికి భ్రమలు విడిపోయాయి. కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపాక.. ఆ పార్టీలో వైయస్సార్ టిపి విలీనం అవుతుందని అంతా భావించారు. కాంగ్రెస్లో వైయస్ కుటుంబం ప్రస్థానం ప్రారంభమవుతుందని అంచనా వేశారు. అయితే పుట్టిన రాష్ట్రం కంటే.. మెట్టినిల్లు అయిన తెలంగాణ రాజకీయాల్లోనే తాను ఉంటానని భీష్మించుకునేసరికి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం మానేసింది. చర్చలు జరిపాక వదిలేసింది. దీంతో షర్మిళకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

తెలంగాణ వ్యాప్తంగా రాజన్న రాజ్యం తెస్తానని.. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు షర్మిల ప్రకటించారు. కానీ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చినవారు పార్టీ ఫండ్ ను పెద్ద ఎత్తుగా ఆశిస్తున్నారు. కానీ ఇటు నుంచి ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ఎన్నికల ఖర్చులు, ప్రచార సామాగ్రి సైతం ఇవ్వడానికి ఇబ్బందికర పరిస్థితులే. దీంతో ఆసక్తి చూపుతున్నవారు సైతం పక్కకు తప్పుకోవడం కనిపిస్తోంది.

మొదటినుంచి తనకు పాలేరు నుంచి బరిలో దిగుతానని షర్మిల ప్రకటిస్తూ వచ్చారు. మొన్నటి కాంగ్రెస్ చర్చలతో పాలేరు పేచీతోనే విలీన ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఇంత జరిగిన షర్మిల మాత్రం మొండి పట్టు వీడడం లేదు. అక్కడి నుంచే పోటీ చేస్తాను తెగేసి చెబుతున్నారు. నవంబర్ 4న నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అనుచరుడు పిట్ట రామ్ రెడ్డి పాలేరులో సమావేశం ఏర్పాటు చేస్తే పట్టుమని 40 మంది కూడా రాలేదు. దీంతో అక్కడ బరిలో దిగిన షర్మిల ఓడిపోవడం ఖాయమని.. దానికి ఎందుకంత పట్టు అని రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version