Sri Divya: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైంది. ఇప్పటి కే మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలో ఇటలీలో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే మరి కొంద మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు వివాహం చేసుకోబోతున్నారు. ఈ తరుణంలో తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆమె ఎవరో కాదు. శ్రీ దివ్య. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత హీరోయిన్ గా పలు సినిమాల్లో కనిపించింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో కొన్ని సినిమాల్లో కనిపించింది. ఆయితే ప్రస్తుతం ఈ భామ పెళ్లి చేసుకోబతుందని తేలడంతో హాట్ టాపిక్ గా మారింది.
1993 ఏప్రిల్ 1న శ్రీదివ్య హైదరాబాద్ లో జన్మించింది. దివ్య కేంద్రీయ విశ్వ విద్యాలయంలో విద్యనభ్యసించింది. ఆమెకు మూడు సంవత్సరాల వయసులో ఉండగానే టీవీలో నటించే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ జంక్షన్ లో హీరోయిన్ స్నేహ వద్ద ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో శ్రీదివ్యను చూడొచ్చు. ఆ తరువాత వీడే సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తరువాత చదువుపై ఫోకస్ పెట్టింది.
2010లో రవిబాబు తీసిన మనసారా అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన ఫస్ట్ మూవీ సక్సెస్ కావడంతో ఆ తరువాత మారుతి డైరెక్షన్లో వచ్చిన ‘బస్ స్టాప్’ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో శ్రీ దివ్య ఫేమస్ అయింది. అయితే ఆ తరువాత తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ కొన్ని సినిమాలలో నటించిన శ్రీ దివ్య స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేకపోయింది. తాజాగా ఆమె ‘రైడ్’ సినిమాలో కనిపించనుంది.
ఈ తరుణంలో శ్రీ దివ్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘రైడ్’ సినిమా సందర్భంగా ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లిపై కొన్ని ప్రశ్నలు అడిగారు. దీంతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. ఇప్పటికే తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, ఆయననే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. అయితే ఆ లక్కీ బాయ్ ఎవరు అనేది మాత్రమే శ్రీదివ్య చెప్పలేదు.