Item Songs : జీవనశైలిలో మార్పుల వల్ల ఈరోజుల్లో అమ్మాయిలు చిన్నవయస్సులోనే రజస్వల అవుతున్నారు. వీటికి ముఖ్యకారణం మారిన జీవనశైలి, ఆహారంలో మార్పులు అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అమ్మాయిలు 10 నుంచి 15 ఏళ్ల వయస్సులో రజస్వల అవుతుంటారు. కానీ ప్రస్తుతం పదేళ్లు నిండకుండానే రజస్వల అవుతున్నారు. వీటిన్నింటికి శరీరంలో జరిగే మార్పులని నిపుణులు అంటున్నారు. అయితే అమ్మాయిలే చిన్న వయస్సులో రజస్వల కావడానికి మరో ఐటెమ్ సాంగ్స్, అడల్ట్ కంటెంట్ కూడా అని అంటున్నారు. ఎప్పుడు రజస్వల అవుతారో ఎవరు చెప్పలేం. అలాంటిది ఐటెమ్ సాంగ్స్ వల్ల తొందరగా మెచ్యూర్ అవుతారని అనుకోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? మరి ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.
తల్లిదండ్రులకు పిల్లలు అన్ని విషయాలు నేర్పిస్తున్నారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే అన్ని కళలను పరిచయం చేస్తున్నారు. అయితే డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం వంటివి కూడా నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఐటెమ్ సాంగ్స్ చేయడం, పాటల్లోని లిరిక్స్ వింటారు. అలాగే కామెడీ షోలు చూసేటప్పుడు డబుల్ మీనింగ్‌లు ఉంటాయి. పిల్లలకు అర్థం కాకపోతే పేరెంట్స్‌ను అడుగుతారు. వీటివల్ల పిల్లల హార్మోన్లలో మార్పులు వచ్చి తొందరగ మెచ్యూర్ అవుతారని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో ఉందో ఆధారాలు అయితే లేవు. చిన్నప్పటి నుంచే పిల్లలకు అన్ని యాక్టివిటీలు తెలియాలని.. షోలుకు అన్నింటికి పంపుతారు. ఈ వయస్సులో పిల్లలకు పెద్దగా బాడీ లేకపోయిన కూడా వివిధ పద్ధతులతో బాడీ బాగా కనిపించేలా ట్రై చేస్తారు. దీనివల్ల వారి ఆలోచనలో మార్పులు వస్తాయి. అలాగే హార్మోన్లలో కూడా ఛేంజ్ వస్తుంది. దీనివల్ల వారు తొందరగా రజస్వల అయ్యే అవకాశం ఉంది. పిల్లలు వారిలా కాకుండా వేరే వారిలా యాక్టింగ్ చేస్తే ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. దీంతో మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారని నిపుణులు చెబుతున్నారు.
అమ్మాయిలు తొందరగా మెచ్యూర్ కావడానికి ప్రధాన కారణం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఈ హార్మోన్లు పదేళ్ల తర్వాత ప్రారంభం అవుతాయి. కానీ ఈరోజుల్లో 8 ఏళ్ల కంటే ముందు వస్తున్నాయి. అలాగే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో తల్లి, మేనత్త, నానమ్మ ఇలా ఎవరైనా తొందరగా రజస్వల అయి అవకాశం ఉంది. కొందరి అమ్మాయిలు బాడీ బట్టి కూడా మెచ్యూర్ అవుతారు. అంటే ఎక్కువ బరువుగా ఉండటం వల్ల కూడా తొందరగా రజస్వల అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. కొందరి పిల్లలకు పోషకాహార లోపం ఉంటుంది. ఐరన్, విటమిన్ డి వంటి పోషకాల లోపం వల్ల కూడా చిన్న వయస్సులోనే పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా చెప్పడం జరిగింది.