
ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి పరిశోధనలు చేసే కొద్దీ ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు సంబంధించిన మరో కొత్త లక్షణాన్ని కనిపెట్టారు. చెవిలో ఏవైనా వింత శబ్దాలు వినిపిస్తున్నా.. చెవిలో శబ్దం వినిపిస్తూ తల చుట్టూ కంపిస్తున్నట్టు అనిపిస్తున్నా కరోనా సోకినట్లే అని చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో చెవుల్లో శబ్దాలు వినిపిస్తున్నాయని తెలుపుతున్నారు.
కరోనా సోకిన 12 నుంచి 30 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చెవుల్లో వింత శబ్దాలు వినిపిస్తూ కరోనా నిర్ధారణ అయితే ప్రమాదమేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. అంగిలా రస్కిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అమెరికా, బ్రిటన్ టిన్నిటస్ సంస్థల సహాయంతో ఈ అధ్యయనం నిర్వహించారు.
48 దేశాలకు చెందిన కరోనా బాధితులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా 3,103 మందిలో చెవుల్లో రింగుల శబ్దం వినిపించిందని సమాచారం. గతంలో ఈ తరహా లక్షణాలు లేకపోయినా కరోనా సోకిన తర్వాతే చాలామందిలో ఈ తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వాళ్లు వినికిడి సమస్య బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్న తరువాత చాలామంది జీవన శైలి, ఆహారపు అలవాట్లను మార్చుకున్నారు. అయినప్పటికీ వీళ్లలో కూడా వినికిడి సమస్యలను శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో వినికిడి సమస్యతో బాధ పడే వాళ్లకు కరోనా సోకిన తరువాత ఆ సమస్య మరింత తీవ్రమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments are closed.