కేంద్రం శుభవార్త: రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి రకు చిన్నవ్యాపారులకు,ఉద్యోగులకు వివిధ ప్రయోజనాలు కల్పించేందకు ఎన్నో ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టింది. కరోనా ప్రారంభంలో రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ, ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యాన్ని కల్పించింది. తాజాగా కేంద్రం మరో ప్యాకేజీని ప్రకటించింది. రూ. 2 లక్షల కోట్ల ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను ప్రకటించింది. Also Read: ఎస్వీబీసీ ఛానెల్ లో అసలేం జరుగుతోంది..? భారత్ లో కరోనా వైరస్ విస్తరణతో ప్రతీ భారతీయుడు ఆర్థిక సంక్షోభాన్ని […]

Written By: NARESH, Updated On : November 12, 2020 9:50 am
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి రకు చిన్నవ్యాపారులకు,ఉద్యోగులకు వివిధ ప్రయోజనాలు కల్పించేందకు ఎన్నో ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టింది. కరోనా ప్రారంభంలో రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ, ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యాన్ని కల్పించింది. తాజాగా కేంద్రం మరో ప్యాకేజీని ప్రకటించింది. రూ. 2 లక్షల కోట్ల ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను ప్రకటించింది.

Also Read: ఎస్వీబీసీ ఛానెల్ లో అసలేం జరుగుతోంది..?

భారత్ లో కరోనా వైరస్ విస్తరణతో ప్రతీ భారతీయుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం లేక ఫైనాన్షియల్ గా ఎదురు దెబ్బలు తిన్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందకు పలు ప్యాకేజీలను ప్రకటించింది. చిరు వ్యాపారులకు రూ.10 వేల తక్షణ లోన్ సదుపాయాన్ని కల్పిస్తూ చేదోడు వాదోడుగా నిలిచింది.  మధ్యతరహా వ్యాపారులకు రుణం సదుపాయం కల్పిస్తూ వడ్డీమాఫీ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది.

Also Read: డిజిటల్ మీడియాపై కేంద్రం ఫోకస్.. అశ్లీలతను అడ్డుకునేందుకేనా?

తాజాగా బుధవారం మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 2 లక్షల కోట్ల విలువైన ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాలకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

1. అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, 2, ఎలక్ట్రానిక్ లేదా టెక్నాలజీ ప్రొడక్ట్స్, 3. ఆటోమొబైల్స్ మరియు ఆటో కాంపోనెంట్స్ 4. ఫార్మాస్యూటికల్స్ డ్రగ్స్ 5. టెలికం మరియు నెటవర్కింగ్ ఉత్పత్తులు 6. టెక్సటైల్స్ ఉత్పత్తులు 7. ఆహార ఉత్పత్తులు 8. హై-ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మోడ్యూల్స్ 9. వైట్ గూడ్స్ 10. స్పెషాలిటీ స్టీల్ ఉన్నాయి. దేశీయ రంగాన్ని అంతర్జాతీయస్థాయిలో ధీటుగా మలిచేందుకు చర్చలు చేపడుతామని, తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్నారు.