https://oktelugu.com/

అయ్యా బాబోయ్.. స్టైలీష్ స్టార్ ఇలా అయ్యాడెంటీ.. ఫ్యాన్స్ తట్టుకోగలరా?

దర్శకుడు సుకుమార్.. సైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. దీంతో గత ఆరేడు నెలలుగా సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే తాజాగా ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది. Also Read: కాజల్ ముందుచూపు.. సైడ్ బిజినెస్ షూరు..! ‘పుష్ప’ మూవీ షూటింగులో పాల్గొనేందుకు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 08:35 PM IST
    Follow us on

    దర్శకుడు సుకుమార్.. సైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. దీంతో గత ఆరేడు నెలలుగా సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే తాజాగా ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది.

    Also Read: కాజల్ ముందుచూపు.. సైడ్ బిజినెస్ షూరు..!

    ‘పుష్ప’ మూవీ షూటింగులో పాల్గొనేందుకు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మూడురోజులు ముందుగానే అక్కడికి వెళ్లాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న నటిస్తోంది. అల్లు అర్జున్ ‘పుష్ప’లో లారీ డ్రైవర్ గా నటిస్తుండటంతో డిఫరెంట్ లుక్కులో కన్పించనున్నాడు. తాజాగా అల్లు అర్జున్ సంబంధించిన ఓ ఫొటో బయటికి వచ్చింది.

    Also Read: మెగాస్టార్ కోలువాలని పూజలు చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

    ఇందులో అల్లు అర్జున్ రఫ్ లుక్కులో.. పెరిగిన జట్టు.. మాసిన గడ్డంతో కన్పిస్తున్నాడు. లాక్డౌన్ సమయంలోనూ అల్లు అర్జున్ ఇలాంటి లుక్కులోనే కన్పించాడు. అప్పట్లోనే ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ‘పుష్ప’ సినిమా షూటింగులోనూ పెరిగిన గడ్డం.. జుట్టుతో కన్పించి అయ్యా బాబోయ్ అనిపిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఈ లుక్కులో అల్లు అర్జున్ చూసి అభిమానులు తట్టుకోగలరా? అనే సందేహాలు కలుగుతుంది. అయితే దర్శకుడు సుకుమార్ ‘రంగస్థలం’ మూవీలోనూ చరణ్ కథకు తగ్గట్టుగా చెవిటివాడిగా చూపించి బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టాడు. ఇక స్టైలీష్ స్టార్ ను సైతం కథ రీత్య ఢిపరెంట్ గెటప్ లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. మరీ ‘పుష్ప’ మూవీ కూడా ‘రంగస్థలం’ సినిమాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో వేచిచూడాల్సిందే..!