https://oktelugu.com/

Dengue Fever: డెంగ్యూ ఇప్పుడు డేంజర్ ..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

డెంగ్యూ ఇది ఒక ప్రమాదకరమైన వ్యాధిగా చెబుతుంటారు వైద్యులు. ఈ వ్యాధి దోమ కాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. గత కొద్ది రోజులుగా డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 5, 2024 / 04:43 AM IST

    Dengue Fever

    Follow us on

    Dengue Fever: వర్షాకాలం మొదలు అయితే చాలు ఎన్నో రకాల వ్యాధులు రాజ్యమేలుతుంటాయి. ఇక దోమలు, ఈగల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవే ఎక్కువ వ్యాధులను స్ప్రెడ్ చేస్తుంటాయి. అయినా సరే ఇంటి ముందు చెత్తాచెదారం పెట్టుకునే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. తద్వారా హాస్పిటల్ కు క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రస్తుతం అన్ని వ్యాధుల కంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటివి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి. ఇందులో ప్రాణాంతకమైన డెంగ్యూ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    డెంగ్యూ ఇది ఒక ప్రమాదకరమైన వ్యాధిగా చెబుతుంటారు వైద్యులు. ఈ వ్యాధి దోమ కాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. గత కొద్ది రోజులుగా డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలో డెంగ్యూని మహమ్మారిగా ప్రకటించడంతో మరింత భయం ఎక్కువ అయింది. అయితే రోజురోజుకూ కేసులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కర్ణాటకలో డెంగ్యూ అంటువ్యాధిగా మారి వ్యాపిస్తోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా డెంగ్యూ కొద్ది రోజుల్లోనే నయం అవుతుంది. కానీ, కొంతమందిలో డెంగ్యూ కారణంగా శరీరంలో ప్లేట్‌లెట్స్ తక్కువ అవుతున్నాయి. ఇలా జరిగితే రోగికి వ్యాధి ప్రాణాంతకంగా మారవచ్చు. అయితే, ఒక వ్యక్తి జీవితంలో ఎన్నిసార్లు డెంగ్యూ బారిపడే అవకాశం ఉందో మీకు తెలుసా?

    ప్రపంచవ్యాప్తంగా సగటున 400 మిలియన్లు, భారత దేశవ్యాప్తంగా 2.5 లక్షల వరకు డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ జ్వరం వచ్చిన వారిలో ముందుగా పెద్దగా లక్షణాలు కనిపించవు. ఆ తరువాత ఎక్కువగా జ్వరం, తలనొప్పి, వాంతులు, వికారం, కండరాల నొప్పి, చర్మంపై చిన్న చిన్న ఎర్రటి మచ్చలు, లేదా రక్తస్రావం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు పెరుగుతుంటాయి. అయితే కొందరిలో తీవ్రమైన డెంగ్యూ జ్వరం ఉన్నా సరే రక్తస్రావం ఉండదు. ఇది రక్త ప్రసరణ వ్యవస్థ వైఫల్యం, షాక్, మరణానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో నాలుగు సార్లు డెంగ్యూ వస్తుందట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. డెంగ్యూ ఎంత తరచుగా వస్తుందో కూడా తెలుసుకోవాలి.

    డెంగ్యూలో నాలుగు రకాలు ఉన్నాయి. వాటినిD1, D2, D3, D4గా వేరు చేశారు. వీటిలో ఒక వ్యక్తికి జీవితకాలంలో ఏదో ఒకసారి ఈ నాలుగు రకాలు వచ్చి పోతుంటాయి. ఇందులో D2 డెంగ్యూ అనేది ఎక్కువ ప్రమాదకరం. ఇందులో ప్లేట్‌లెట్స్ చాలా వేగంగా పడిపోతుంటాయి. దీంతో ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. డెంగ్యూ నివారణకు పరిశుభ్రత పాటించడం ఒక్కటే ముఖ్యం. ఇంట్లోకి దోమలు రాకుండా, దోమ కాటుకు గురి కాకుండా చూసుకోవాలి. రాత్రి పడుకొనేటప్పుడు కూడా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడా నీరు నిలిచిపోతే దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. నీరు ఉంటే దోమలు వ్యాప్తి పెరుగుతుంది. డెంగ్యూ వచ్చి తగ్గాక నిరంతరంగా అలసటగా అనిపించినా, కండరాల నొప్పి పెడుతున్నా, కీళ్ల నొప్పులుగా ఉన్న సరే మీరు వైద్యులను కలవాలి.