Morning Headache : ఉదయం నిద్ర లేచాక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఆరు గంటల పాటు మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దీంతో ఎటువంటి ఆలోచనలు లేకుండా నిద్రపోయిన తరువాత ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్ల మంచ ఆలోచనలు వస్తుంటయి. అయితే కొన్ని ముఖ్యమైన పనులు ఉదయమే చేయాలి అని అంటారు. కానీ కొందరికి ఉదయం లేవగానే తలనొప్పిగా ఉంటుంది. లేదా చికాకు ఉండి వాంతులు వచ్చినట్లుగా అనిపిస్తాయి. మరికొందరికి తలనొప్పితో పాటు జీర్ణ సమస్యలు కూడా ఉంటాయి. అయితే ఇలా ఉండడాన్ని కొందరు నిర్లక్ష్యం చేస్తారు. దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ సాధారణమైన తలనొప్పి అని భావిస్తారు. కానీ ఉదయం లేచిన తరువాత వచ్చే తలనొప్పికి సంకేతం ఏంటో తెలుసా?
తలనొప్పి అనగానే టీ లేదా కాఫీ తీసుకుంటే సరిపోద్ది.. లేదా మాత్ర వేసుకుంటే సరి.. అని చాలా మంది అభిప్రాయం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చిన్న అనారోగ్యాన్ని చిన్న అంచనా వేయలేం. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాధులు ఇలాంటి చిన్న ఆనారోగ్యాలు వస్తున్నాయంటే భవిష్యత్ లో ఏదో ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. అలాగని అన్నీ తలనొప్పులు ఒకే రకమని అనుకోవడానికి వీలు లేదు. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న వాటిని గుర్తించి వెంటనే అప్రమత్తం కావాలి.
ఈ మధ్య మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధుల గురించి చాలా వినాల్సి వస్తోంది. చాలా మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. కొందరికీ దీని నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకున్నారు. కానీ మరికొందరు మాత్రం వీటి నుంచి బయటపడడం లేదు. ఇలాంటి సమయంలో మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ కు సంబంధించి కొన్ని లక్షణలు ముందే బయటపడుతాయి.ఇవి గ్రహించి ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే భవిష్యత్ లో భారీగా నష్టపోకుండా ఉండగలుగుతాం.
మైగ్రేన్ లేదా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధులకు ముందుగా వచ్చే లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. వీటిలో ప్రధానమైది ఉదయమే తలనొప్పి రావడం. ఉదయం లేవగానే విపరీతమైన తలనొప్పి ఉంటుంది. వాంతులు వచ్చే విధంగా ఒకారం అనిపిస్తుంది. జీర్ణ సమస్య ఉండి ఆందోళనగా ఉంటుంది. ఒక్కసారిగా వణుకు పుడుతుంది. కాసేపు ఏ పని చేయకుండా పడుకుంటే రిలాక్స్ అయితే అది మైగ్రేన్ అని గుర్తించాలి. లేదా అదే పనిగా తలనొప్పితో బాధపడుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ప్రస్తుతం నాణ్యమైన ఆహారం దొరకడం గగనం అవుతోంది. ప్రతీరోజూ తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లభించడం లేదు. దీంతో కొత్త కొత్త వ్యాధులు దరిచేరుతున్నాయి. అయితే పై లక్షణాలు ఉంటే ముందే గ్రహించి వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది. అయితే మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ కు సరైన చికిత్స లు ఉన్నాయి. కానీ ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. తలనొప్పినే కదా అని నిర్లక్ష్యంగా ఉంటే ఆ తరువాత ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎప్పుడూ తలనొప్పి లేని వారికి ఒక్కసారిగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.