Nara Chandrababu naidu : మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. రాజకీయ నాయకులకు భాష మీద పట్టుతోపాటు విషయపరిజ్ఞానం కూడా ఉండాలని. అలా విషయ పరిజ్ఞానం లేకుంటే రాజకీయ నాయకులు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా సభలో లేదా సమావేశాలలో కవర్ చేసుకోలేక నానా తంటాలు పడాల్సి వస్తుంది. అసలే ఇప్పుడు సోషల్ మీడియా కాలం. ఒక్క చిన్న మాట కూడా బయటికి వెళ్లినా దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి పార్టీల సోషల్ మీడియా విభాగాలు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అధికారంలో ఉన్నవాళ్లు..మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా మాట్లాడాలి. విషయ పరిజ్ఞానం లేకుంటే.. ఆ టాపిక్ పై మాట్లాడొద్దు. ఎలాగో ముఖ్యమంత్రి హోదా ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే జనాల్లో చులకన కావాల్సి వస్తుంది.
ఏపీలో ఇటీవలి ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా గురువారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. ఈ క్యాంటీన్లలో ఒకదానిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రారంభించారు. ఆయన, ఆమె కలిసి అన్న క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు పలువురు ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ఇక్కడ వరకు బాగానే ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇక్కడే చంద్రబాబు ట్రాక్ తప్పారు. దీంతో సోషల్ మీడియాలో టోల్ అవుతున్నారు.
ఆ ఆటో డ్రైవర్ ను వేదిక పైకి పిలిపించుకున్న చంద్రబాబు నాయుడు.. అతడిని పలు ప్రశ్నలు అడిగారు. నువ్వు ఏం చేస్తుంటావ్ అని చంద్రబాబు అడిగితే.. ఆ డ్రైవర్ నేను ఆటో తోలుతుంటాను సార్ అని చెప్పాడు. నీ ఆటో ఇంజన్ డీజిలా? పెట్రోలా? అని చంద్రబాబు అడిగితే.. డీజిల్ అని ఆ ఆటో డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనంగా ఈ ఆటోను మార్చు అని చంద్రబాబు అంటే.. దానికి ఆ ఆటో డ్రైవర్ ఓకే చెప్పాడు. ఎలక్ట్రిక్ వాహనంగా మార్చే విధానం నీకు తెలుసా అని చంద్రబాబు అడిగితే.. తెలియదు సార్ అని ఆ ఆటో డ్రైవర్ సమాధానం చెప్పాడు. దానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? డీజిల్ ఇంజన్ తీసేసి ఎలక్ట్రిక్ ఇంజన్ మార్చేస్తే సరిపోతుంది కదా? అని చంద్రబాబు అన్నారు. దానికి షాక్ అవడం ఆటోడ్రైవర్ వంతయింది. ఎందుకంటే డీజిల్ ఇంజన్ స్థానంలో, ఎలక్ట్రిక్ ఇంజన్ ఏర్పాటు చేయడం అంత సులభమైనది కాదు. ఎందుకంటే దానికంటూ ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. ఆటోను ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం తెలియకుండా చంద్రబాబు అలా అన్నారు. ఈ వీడియోను వైసిపి సోషల్ మీడియా విభాగం తెగ సర్కులేట్ చేస్తోంది. అయితే దీనికి టిడిపి నాయకులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.
Ending miss avakandi
And
Please don’t laugh@ncbn start… pic.twitter.com/Uiv2MC5Gzb— రామ్ (@ysj_45) August 15, 2024