India Book of Records : సాధారణంగా టాటూ ఇష్టం కోసమే లేదా స్టైల్ కోసం వేసుకుంటారు. ప్రేమించిన వాళ్లు, తల్లిదండ్రులు, పిల్లల పేర్లు వేయించుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దేశం కోసం వీరమరణం పొంది అమరులైన వాళ్ల పేర్లను తన ఒంటిపై టాటూలు వేయించుకున్నాడు. మన దేశాన్ని కాపాడుతూ చాలామంది సైనికులు ఇప్పటికీ వీరమరణం పొందారు. అమరులైన సైనికులకు నివాళ్లు ఆర్పిస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అమరులైన సైనికులపై కొత్తగా దేశభక్తిని చాటుకున్నాడు. అమరులైన సైనికులకు గుర్తుగా తన శరీరంలో 631 పచ్చబొట్టులు వేయించుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన వాళ్ల పేర్లు టాటూలు వేయిచుకున్నాడో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌కి చెందిన అభిషేక్ గౌతమ్ తన శరీరంపై టాటూలు వేయించుకున్నాడు. కార్గిల్ యుద్ధంలో మరణించిన అమరవీరుల త్యాగానికి గుర్తుగా అతను పచ్చబొట్లు వేయించుకున్నాడు. అతను టాటూ వేయించుకోవడానికి ముఖ్య కారణం సైనికులు. ఓసారి అతను తన స్నేహితులతో కలిసి సరిహద్దుల్లోకి వెళ్లారు. అప్పుడు వాళ్లకి జరిగిన ఓ ప్రమాదర ఘటనే.. అతన్ని టూటూ వేయించుకునేలా మార్చేసింది. సరిహద్దుల్లో జరిగిన ఆ ప్రమాదర ఘటనలో భారత సైనికులు వాళ్లను కాపాడారు. సైనికులు ఆరోజు వాళ్లను రక్షించకపోతే ఈరోజు ఉండేవాళ్లు కాదు. అంత ప్రమాదకర ఘటనలో కూడా సైనికులు వాళ్ల ప్రాణాలను బలంగా పెట్టి వీళ్లను రక్షించారు. దీంతో అతను తన నిర్ణయాన్ని మార్చుకుని అమరులైన సైనికులు పేర్లను పచ్చబోట్లుగా వేయించుకున్నాడు.
దేశాన్ని రక్షించడం కోసం ఎంతోమంది సైనికులు బోర్డర్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే వాళ్లు దేశాన్ని కాపాడుతున్నారు. అలా అమరులైన సైనికులకు ఏదైనా ఇవ్వాలని అభిషేక్ తన శరీరంలో టాటూలు వేయించుకున్నాడు. సరిహద్దుల్లో అమరులైన సైనికుల పేర్లను టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా కార్గిల్ అమరవీరుల పేర్లను ముందు టాటూ వేయించుకున్నాడు. వీళ్ల పేర్లు మాత్రమే కాకుండా కార్గిల్ స్థూపం, ఇండియా గేట్ గుర్తులతో కూడా టాటూ వేయించుకున్నాడు.
ముఖ్యంగా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోష్, ఝాన్సీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్, ఛత్రపతి శివాజీ వంటి వాళ్ల పేర్లను కూడా టూటూ వేయించుకున్నాడు. ఇప్పటివరకు అతను 631 టాటూలు అతని శరీరంపై వేసుకున్నాడు. ఇందుకు అతను ఇండియ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అలాగే లివింగ్ వాల్ మెమోరియల్ బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. అలాగే కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలను సందర్శించి.. వాళ్ల ఇంటి మట్టిని తీసుకొచ్చి కార్గిల్ అమరవీరుల స్థూపం దగ్గర ఏర్పాటు చేసిన కలశంలో వేసి ఉంచారు. అమరులైన ప్రతి సైనికుడు ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులను సందర్శిస్తుంటారు. అలాగే సైనికుడు ఇంటి మట్టిని తీసుకొచ్చి ఆ కలశంలో గౌతమ్ వేస్తుంటారు. ఈ ప్రక్రియ ఎప్పటికీ కొనసాగుతుందని గౌతమ్ చెప్పాడు.